కాపీ, పేస్ట్‌ పొరపాటు.. బ్యాంక్‌ నుంచి రూ. 52 వేల కోట్లు బదిలీ వీడియో

Updated on: Mar 09, 2025 | 3:02 PM

ఒక బ్యాంకు ఉద్యోగి చేసిన తప్పిదం వల్ల ఏకంగా ఆరు బిలియన్‌ డాలర్లు అదే బ్యాంకుకు చెందిన ఓ ఖాతాదారు అకౌంట్ లోకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. సిటీ గ్రూప్‌లో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా బయటికొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తున్న ఉద్యోగి.. నగదు బదిలీ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అంతకు ముందు కాపీ చేసిన ఖాతాదారుడి అకౌంట్‌ నెంబరును క్యాష్‌ కాలమ్‌లో పేస్ట్‌ చేశారు. దీంతో బ్యాంకు నుంచి ఆరు బిలియన్‌ డాలర్లు అంటే 52 వేల కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.

 మరుసటి రోజు ఈ తప్పిదాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించి సరిచేశారు. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అదే నెలలో బ్యాంకులో మరో తప్పిదం జరిగింది. మరో క్లయింట్‌ ఖాతాలోకి భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. 90 నిమిషాల్లో దీన్ని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమస్య గురించి బ్యాంకు రెగ్యులేటర్స్‌కు తెలియజేసినట్లు కథనం తెలిపింది. తమ బ్యాంకులో జరిగిన ఈ తప్పిదాలపై సిటీగ్రూప్‌ స్పందించింది. ‘‘బదిలీ ప్రక్రియలో జరిగిన తప్పిదాన్ని వెంటనే గుర్తించి పరిష్కరించామని తెలిపింది. దీని వల్ల ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగలేదనీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మానవ ప్రమేయాన్ని తగ్గించి.. ఆటోమేషన్‌ను మెరుగుపరిచాం అని ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో

ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్‌ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో

చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో

Published on: Mar 09, 2025 02:57 PM