Hyderabad: ఉచిత హలీమ్ ఆఫర్.! హైదరాబాద్ హోటల్ ముందు రచ్చ రచ్చ.!
రంజాన్ మాసం తొలి రోజున గంట పాటు ఉచిత హలీమ్ ఇస్తామంటూ హోటల్ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. దీంతో, ఆ సాయంత్రం కస్టమర్లు హోటల్‌కు ఒక్కసారిగా పోటెత్తడంతో వారిని నియంత్రించడం యాజమాన్యం వల్ల కాలేదు. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండటంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు బాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది.
రంజాన్ తొలి రోజున ఉచిత హలీమ్ ఆఫర్‌ను ప్రకటించిన ఓ హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్లు పోటెత్తడంతో అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కస్టమర్లను కంట్రోల్ చేసేందుకు చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలోని అజీబో ముఖారీ మండీ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రంజాన్ మాసం తొలి రోజున గంట పాటు ఉచిత హలీమ్ ఇస్తామంటూ హోటల్ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. దీంతో, ఆ సాయంత్రం కస్టమర్లు హోటల్‌కు ఒక్కసారిగా పోటెత్తడంతో వారిని నియంత్రించడం యాజమాన్యం వల్ల కాలేదు. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండటంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు బాటన్ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో, స్థానికంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. కాగా, ఉచిత ఆఫర్‌కు సంబంధించి హోటల్ యాజమాన్యం తమ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. న్యూసెన్స్ సృష్టించడం, ట్రాఫిక్ జాంకు కారణమైనందుకు హోటల్ నిర్వాహకులపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే అదనుగా కొందరు చేతివాటం ప్రదర్శించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

