రైలుపట్టాలపై నీటిలో చేపలు సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ముంబై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. అండర్ పాస్ లు, రైల్వే స్టేషన్లు, పట్టాలు నీట మునిగాయి. రైళ్లు, బస్సులు బంద్ కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాలకు పలుచోట్ల రైలు పట్టాలు నీట మునగడం, ఆ నీటిలో చేపలు తిరగడం కనిపించింది.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ముంబై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. అండర్ పాస్ లు, రైల్వే స్టేషన్లు, పట్టాలు నీట మునిగాయి. రైళ్లు, బస్సులు బంద్ కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాలకు పలుచోట్ల రైలు పట్టాలు నీట మునగడం, ఆ నీటిలో చేపలు తిరగడం కనిపించింది. సిటీలోని ఓ రైల్వే స్టేషన్ లో పట్టాల మధ్య చేపలు తిరుగుతుండడం చూసి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నాలుగైదు చేపలు చెరువులోనో నదిలోనో ఉన్నట్లు ఎంచక్కా అటూఇటూ పరుగులు తీస్తున్నాయి. ఇప్పటి వరకూ రైళ్లు పరుగెత్తడం మాత్రమే చూశాం.. కానీ ఇప్పుడు రైలు పట్టాలు చేపల చెరువులుగా మారాయంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లాకర్ తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు !!
పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్.. ఏం జరిగిందంటే..
పశువుల పాక నుంచి వింత శబ్దాలు..ఏంటా అని చూసిన రైతు షాక్!
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

