లాకర్ తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు !!
ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు.. లాకర్ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎమ్ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ విచిత్ర ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద ఏరియాలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్దకు మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్ వాహనంలో వచ్చారు.
ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు.. లాకర్ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎమ్ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ విచిత్ర ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద ఏరియాలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్దకు మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్ వాహనంలో వచ్చారు. ఈ ఏటీఎం ఎస్బీఐ బ్యాంకు పక్కనే ఉంది. వేకువ జాము కావడంతో జనసంచారం లేదు. ఇదే అదనుగా దుండగులు ఏటీఎంలోని లాకర్‌ను తెరిచేందుకు యత్నించారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోకపోవడంతో దాన్ని తాళ్లతో కట్టి.. ఆ తాళ్లు తమ వాహనానికి జత చేసి లాగారు. దీంతో ఏటీఎమ్ గది అద్దాల తలుపులు ధ్వంసం చేసుకుంటూ బయటకు వచ్చింది. అనంతరం చోరీ చేసిన ఏటీఎంను తమ వాహనంలో వేసుకొని తీసుకెళ్లినట్లు అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డైంది. దుండగులు ఏటీఎంను దొంగిలిస్తున్న సమయంలో సైరన్ మోగడంతో బ్యాంకు అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనేలోగా దొంగలు పరారయారు. ఏటీఎంలో రూ.3.97 లక్షల మేర నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్.. ఏం జరిగిందంటే..
పశువుల పాక నుంచి వింత శబ్దాలు..ఏంటా అని చూసిన రైతు షాక్!
బదిలీపై వెళ్తున్న గురువుకు అరుదైన గురు దక్షిణ !!