బదిలీపై వెళ్తున్న గురువుకు అరుదైన గురు దక్షిణ !!
కొందరు ఉపాధ్యాయులు ఆ వృత్తికే వన్నె తెస్తారు. గురువుగా విద్యార్ధులకు చక్కని బోధన చేయడమే కాకుండా వారి ఉన్నతికి తోడ్పడతారు. విద్యార్ధులందరినీ సమ దృష్టితో చూస్తూ నైతిక విలువలను పిల్లలకు నేర్పుతారు. ఏదో జీతం కోసం పనిచేయకుండా విద్యార్థులను తమ బిడ్డలుగా భావించి వారి ఉన్నతికి తోడ్పడతారు. అలా ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్ధులను తీర్చిదిద్దారు. విద్యార్ధుల ఉన్నతి కోసం తన సగం జీతాన్ని వెచ్చించేవారంటే ఆయన సేవా దృక్పథం అర్ధం చేసుకోవచ్చు.
కొందరు ఉపాధ్యాయులు ఆ వృత్తికే వన్నె తెస్తారు. గురువుగా విద్యార్ధులకు చక్కని బోధన చేయడమే కాకుండా వారి ఉన్నతికి తోడ్పడతారు. విద్యార్ధులందరినీ సమ దృష్టితో చూస్తూ నైతిక విలువలను పిల్లలకు నేర్పుతారు. ఏదో జీతం కోసం పనిచేయకుండా విద్యార్థులను తమ బిడ్డలుగా భావించి వారి ఉన్నతికి తోడ్పడతారు. అలా ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్ధులను తీర్చిదిద్దారు. విద్యార్ధుల ఉన్నతి కోసం తన సగం జీతాన్ని వెచ్చించేవారంటే ఆయన సేవా దృక్పథం అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఉపాధ్యాయుడు తమను వదిలి బదిలీపై వెళ్తుండటంతో ఆ విద్యార్థులంతా బరువైన గుండెలతో వీడ్కోలు పలికారు. అంతేకాదు అరుదైన గురుదక్షిణ సమర్పించి మరీ సాగనంపారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ మసీద్‌బండలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పల్లె అనంత్‌రెడ్డి తన బడినే గుడిగా చేసుకుని బతికారు. 14 ఏళ్లపాటు విద్యార్థులకు గణితం బోధించడంతోపాటు ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. ఇటీవల ఆయన షాబాద్ మండలం హైతాబాద్ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఇదే పాఠశాలలో 11 ఏళ్లు పనిచేసిన ఎస్జీటీ యాదగిరికి సైతం బదిలీ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

