వంటింట్లో గ్యాస్ లీకవుతోందా.. జాగ్రత్త అది గ్యాస్ కాకపోవచ్చు
వర్షాలు ఊపందుకున్నాయి. ఎండలతో అల్లాడిన ప్రజలే కాదు, మూగప్రాణులు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నాయి. అయితో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అటవీప్రాంతంలో, పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖలోని ఓ ఇంట్లో నాగుపాము చేరి ఆ ఇంటివారందరినీ పరుగులు పెట్టించింది.
వర్షాలు ఊపందుకున్నాయి. ఎండలతో అల్లాడిన ప్రజలే కాదు, మూగప్రాణులు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నాయి. అయితో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అటవీప్రాంతంలో, పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖలోని ఓ ఇంట్లో నాగుపాము చేరి ఆ ఇంటివారందరినీ పరుగులు పెట్టించింది. దువ్వాడ లో ని ఓ ఇంట్లో మహిళ వంట చేసేందుకు తమ వంటింట్లోకి వెళ్లారు. ఆమె వంటచేసేందుకు గ్యాస్ వెలిగిద్దామని ప్రయత్నించగా వింత శబ్దాలు వినిపించాయి. మొదట ఆమె గ్యాస్ లీక్ అవుతుందేమో అని చెక్ చేసింది. అయితే గ్యాస్ లీకవుతున్న దాఖలాలు కనిపించలేదు.. కనీసం గ్యాస్ స్మెల్ కూడా రాలేదు. కానీ గ్యాస్ లీకవుతున్నట్టుగా శబ్ధాలు మాత్రం వస్తున్నాయి. అంతకంతకూ ఆ శబ్దాలు పెరుగుతున్నాయి. అనుమానం వచ్చిన ఆమె మిగతా కుటుంబ సభ్యులను పిలిచారు. అందరూ కలిసి శబ్దాలు గ్యాస్ సిలిండర్ దగ్గరనుంచే వస్తున్నాయని గుర్తించి సిలిండర్ను పక్కకు తప్పించి చూసే ప్రయత్నం చేశారు. ఇంకేముంది? సిలిండర్ పక్కనే నాగుపాము చుట్టుకుని పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. అంతే ఒక్క ఉదుటన అక్కడ్నుంచి బయటకు పరుగులు తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలుపట్టాలపై నీటిలో చేపలు సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
లాకర్ తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు !!
పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్.. ఏం జరిగిందంటే..