Cardiac Arrest: విమానంలో ప్రయాణిస్తుండగా కార్డియాక్ అరెస్ట్ సిబ్బంది ఏం చేశారంటే..?
విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. యూనస్ రేయన్‌రోత్ అనే వ్యక్తి .. కన్నూరు నుంచి దుబాయ్ వెళ్తున్న వాడియా గ్రూప్‌కు చెందిన విమానం ఎక్కారు.
విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. యూనస్ రేయన్‌రోత్ అనే వ్యక్తి .. కన్నూరు నుంచి దుబాయ్ వెళ్తున్న వాడియా గ్రూప్‌కు చెందిన విమానం ఎక్కారు. అయితే ప్రయాణం మధ్యలో ఆయన కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. బాధతో అరవడంతో విమాన సిబ్బంది వెంటనే ఆయన దగ్గరికి వెళ్లారు. ఏమైందో చూసేసరికి అప్పటికే శ్వాస ఆగిపోయి, అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై CPR ప్రక్రియను ప్రారంభించారు. అయితే లక్కీగా అదే ఫ్లైట్‌లో డాక్టర్ షబర్ అహ్మద్ ఉండడంతో యూనస్‌ను కాపాడేందుకు ఓ డాక్టర్ దొరికినట్లయింది. ఏఈడీతో రెండు షాకులు ఇచ్చి.. సీపీఆర్ పద్ధతిని పాటించారు. దీంతో గుండె కొట్టుకోవడం ప్రారంభమై వ్యక్తికి మెలకువ చ్చింది. వెంటనే విమానంలోని ఆక్సిజన్ వ్యవస్థపై యూనస్‌ను ఉంచారు.విమానం దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత యూనస్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుడిని కాపాడడ్డంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన విమాన సిబ్బందికి గో ఫస్ట్ విమాన సంస్థ నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే గుండెపోకు గురైన యూనస్‌కు, అతడిని కాపాడిన డాక్టర్ సబర్ అహ్మద్‌కు దేశ, విదేశాల్లో ప్రయాణించేందుకు ఉచిత టికెట్‌ను ఆఫర్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

