జై శ్రీరామ్ సాంగ్ కు టెస్లా కార్ల లైట్ షో.. రామనామ స్మరణతో మారుమ్రోగిన హ్యూస్టన్‌..

జై శ్రీరామ్ సాంగ్ కు టెస్లా కార్ల లైట్ షో.. రామనామ స్మరణతో మారుమ్రోగిన హ్యూస్టన్‌..

Phani CH

|

Updated on: Jan 22, 2024 | 7:17 PM

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దేశ విదేశాల్లోని రామభక్తులు రకరకాలుగా పూజలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్‌లో రామ భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకున్నారు. టెస్లా కార్ లైట్ షోతో రామ్‌ అనే అక్షరాలు వచ్చేలా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 100 మంది టెస్లా కార్ల యజమానులు రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలిజేశారు.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దేశ విదేశాల్లోని రామభక్తులు రకరకాలుగా పూజలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్‌లో రామ భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకున్నారు. టెస్లా కార్ లైట్ షోతో రామ్‌ అనే అక్షరాలు వచ్చేలా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 100 మంది టెస్లా కార్ల యజమానులు రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలిజేశారు. శుక్రవారం సాయంత్రం శ్రీ గురువాయూరప్పన్ కృష్ణ దేవాలయంలో లైట్ షో కోసం సమావేశమయ్యారు. చుట్టుపక్కల ఉన్న వందలాది రామభక్తులు, స్థానికులను ఈ లైట్ షో ఆకర్షించింది. వంద కార్లు పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఉన్నాయి. జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్ అనే సాంగ్ ప్లే అవుతుండగా.. కార్ల నుంచి బీట్ కు అనుగుణంగా లైట్స్ వేశారు. టెస్లా కార్ డ్రైవర్‌లు సాంగ్ కు అనుగుణంగా హెడ్‌లైట్‌లను ఒకే సమయంలో ఆఫ్, ఆన్ చేస్తూ రామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా లైట్ షో నిర్వహించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

4 గంటల్లో టైపు రైటర్‌పై రూపుదిద్దుకున్న శ్రీరాముడు

అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా ??

ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు..

చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..

చెత్తకుప్పలో వేలకొద్దీ ఆధార్‌, పాన్‌కార్డులు..