చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..

చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..

Phani CH

|

Updated on: Jan 22, 2024 | 7:02 PM

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతోమంది చూస్తుండగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సిమ్లాకు 26 కిలో మీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారీగా కొండచరియలు విరిగిపడటంతో భవనం గోడలు దెబ్బతిన్నాయి.

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతోమంది చూస్తుండగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సిమ్లాకు 26 కిలో మీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు భారీగా కొండచరియలు విరిగిపడటంతో భవనం గోడలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించాడు. శనివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం పరిస్థితిని గమనించిన అధికారులు ముందుగానే విద్యుత్‌ను నిలిపివేశారు. భవనం కూలిపోవడంతో ధామి డిగ్రీ కళాశాలకు వెళ్లే దారి దెబ్బతింది. భవనం కుప్పకూలుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెత్తకుప్పలో వేలకొద్దీ ఆధార్‌, పాన్‌కార్డులు..

రష్మిక ‘డీప్‌ఫేక్‌’ కేసు నిందితుడు అరెస్టు !!

షోయబ్‌ మూడో పెళ్లి !! ఎవరీ సనా ?? అప్పుడు ఆయేషా, ఇప్పుడు సానియా

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??