ఇంటి తలుపుల రంగు మార్చినందుకు రూ.19 లక్షల జరిమానా !!
తలుపులకు రంగు మార్చిన కారణంగా ఓ మహిళ భారీగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఎడిన్‌బర్గ్‌లోని న్యూటౌన్‌లో నివసించే మిరాండా డిక్సన్, తలుపు కారణంగా పెద్ద ఇబ్బందుల్లో పడింది.
తలుపులకు రంగు మార్చిన కారణంగా ఓ మహిళ భారీగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఎడిన్‌బర్గ్‌లోని న్యూటౌన్‌లో నివసించే మిరాండా డిక్సన్, తలుపు కారణంగా పెద్ద ఇబ్బందుల్లో పడింది. తన ఇంటి రెనోవేషన్‌లో భాగంగా తలుపులకు రంగు మార్చి 19 లక్షలు జరిమానా చెల్లించింది. మిరాండా ఆ ఇంటిని తన తల్లిదండ్రుల నుండి 2019లో వారసత్వంగా పొందింది. ఈ క్రమంలో ఆ పాత ఇంటికి రంగులు మార్చడంపై ఫిర్యాదులు రావడంతో జరిమానా విధించారు. ఇక్కడి భవనాల చారిత్రాత్మక లక్షణానికి అనుగుణంగా తలుపులకు రంగులు వేయడం వల్ల వారికి జరిమానా విధించినట్లు ఎడిన్‌బర్గ్ సిటీ కౌన్సిల్ తెలిపారు. అయితే తన ఇంటి తలుపుపైఫిర్యాదు కుట్రపూరితమైనది అంటే మిరాండా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆ ఇల్లు ఎడిన్‌బర్గ్ న్యూ టౌన్ వరల్డ్ హెరిటేజ్ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. అందువల్ల, ఆ ప్రాంతంలోని ఆస్తులకు ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఎడిన్‌బర్గ్‌లోని పాత, కొత్త పట్టణాలు 1995లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందాయి. కనుక అక్కడ ఇళ్లకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయాలన్నా ఎడిన్‌బర్గ్ సిటీ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. సదరు మహిళ అనుమతి తీసుకోకపోవడంతో ఫైన్ కట్టే పరిస్థితికి దారితీసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ICC రూల్స్ తెలియని పాకిస్థాన్ బ్యాటర్.. ఔటై పెవిలియన్‌కు
Ramcharan: ఐరన్ మ్యాన్ సిరీస్‌లో రామ్ చరణ్ కీ రోల్
ప్రభాస్ చేతిలో.. ఘోరంగా ఓడిపోయిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్
Chiranjeevi: ఆ ఫేక్ న్యూస్‌లే చిరును ఇబ్బంది పెడుతున్నాయి
S. S.Rajamouli: పాపం!! రాజమౌళి శ్రమకు.. ఇప్పుడు ఫలితం దొరికింది