మంచి దొంగ.. చోరీ చేసాడు.. సారీ అంటూ మెయిల్ పెట్టాడు..

మంచి దొంగ.. చోరీ చేసాడు.. సారీ అంటూ మెయిల్ పెట్టాడు..

Phani CH

|

Updated on: Nov 05, 2022 | 9:26 AM

ఇటీవల దొంగలు కొత్త పోకడలకు పోతున్నారు. వారికి కావలసిన వస్తువులను చక్కగా కొట్టేసి, ఆ తర్వాత సారీ అంటూ లెటర్లు, మెయిల్స్‌ చేస్తున్నారు.

ఇటీవల దొంగలు కొత్త పోకడలకు పోతున్నారు. వారికి కావలసిన వస్తువులను చక్కగా కొట్టేసి, ఆ తర్వాత సారీ అంటూ లెటర్లు, మెయిల్స్‌ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ల్యాప్‌ట్యాప్‌ దొంగిలించడమే కాకుండా ఆ ల్యాప్‌టాప్‌ యజమానికి క్షమించమంటూ మెయిల్ చేశాడు. అంతేకాదు అనికి ఓ బంపరాఫర్‌ కూడా ఇచ్చాడు. జ్వేలీ అనే వ్యక్తి ల్యాప్‌టాప్‌ను ఓ దొంగ దొంగిలించాడు. అనంతరం ఆ దొంగ, ‘‘నన్ను క్షమించండి. నిన్న మీ ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లింది నేనే. కష్టాల్లో ఉన్నా.. కొంత డబ్బు అవసరం పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వచ్చింది. ల్యాప్‌టాప్‌లో మీరు దాచుకున్న రీసెర్చ్ ఫైల్స్‌ను ఈ మెయిల్‌ ద్వారా పంపిస్తున్నా. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏమైనా ఉంటే అక్టోబరు 31 మధ్యాహ్నంలోపు చెప్పండి పంపించేస్తా.. ఎందుకంటే ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ నా వద్ద ఉండదు’’ అని చెప్పాడు. ఇది చూసిన జ్వేలీ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ల్యాప్‌టాప్‌ పోయినందుకు బాధపడాలో.. రీసెర్చ్‌ ఫైల్స్‌ దొరికినందుకు సంతోషపడాలో అర్థంకాక అయోమయంలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని జ్వేలీ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి తలుపుల రంగు మార్చినందుకు రూ.19 లక్షల జరిమానా !!

ICC రూల్స్ తెలియని పాకిస్థాన్ బ్యాటర్.. ఔటై పెవిలియన్‌కు

Ramcharan: ఐరన్ మ్యాన్‌ సిరీస్‌లో రామ్‌ చరణ్ కీ రోల్‌

ప్రభాస్ చేతిలో.. ఘోరంగా ఓడిపోయిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్

Chiranjeevi: ఆ ఫేక్ న్యూస్‌లే చిరును ఇబ్బంది పెడుతున్నాయి

 

Published on: Nov 05, 2022 09:26 AM