అధికారులు ప్రారంభిస్తుండగానే కుప్పకూలిన వంతెన !!
అక్కడ కొత్తగా ఓ వంతెన నిర్మించారు. ఓ ఉన్నతాధికారిని ప్రారంభోత్సవానికి పిలిచారు. అంతా బాగానే ఉంది. కానీ గెస్ట్ వచ్చారు.. వంతెన ప్రారంభించే క్రమంలో రిబ్బన్ కట్‌చేసారు.
అక్కడ కొత్తగా ఓ వంతెన నిర్మించారు. ఓ ఉన్నతాధికారిని ప్రారంభోత్సవానికి పిలిచారు. అంతా బాగానే ఉంది. కానీ గెస్ట్ వచ్చారు.. వంతెన ప్రారంభించే క్రమంలో రిబ్బన్ కట్‌చేసారు. అంతే ఇలా రిబ్బన్ కట్ కాగానే అలా వంతెన కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. డెమొక్రెటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పైగా పెద్ద ఎత్తున్న అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్ కటింగ్ చేస్తుండగా… హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు, పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇదిలా ఉంటే ఈ వంతెనను మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. తిన్నారంటే వదిలిపెట్టరంతే..
వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!
వామ్మో! ఏం గుండె ధైర్యం వీడిది.. అనకొండల మధ్య ఆ చదువేందిరా బాబు
Big News Big Debate: టార్గెట్ ఢిల్లీ.. తగ్గేదే లే..లైవ్ వీడియో