Bride Over Excited: తాళి కట్టే వేళ.. పెళ్లి కూతురు పట్టలేని ఆనందం.. ఏం చేసిందో తెలుసా.. వైరల్ వీడియో

Bride Over Excited: తాళి కట్టే వేళ.. పెళ్లి కూతురు పట్టలేని ఆనందం.. ఏం చేసిందో తెలుసా.. వైరల్ వీడియో

Anil kumar poka

|

Updated on: Sep 21, 2022 | 9:58 AM

వివాహం అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ కీలక మలుపు. ఇక పెళ్లంటే ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు కూడా ఎంతో ఆనందంగా ఎదురుచూసే సమయం. అలాంటిది మనసుకు నచ్చిన వ్యక్తి


వివాహం అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ కీలక మలుపు. ఇక పెళ్లంటే ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు కూడా ఎంతో ఆనందంగా ఎదురుచూసే సమయం. అలాంటిది మనసుకు నచ్చిన వ్యక్తి తనకు భర్తగా వస్తున్నాడంటే ఆ ఆడపిల్ల ఆనందం వేరే లెవల్లో ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో యువతి, యువకులకు వివాహం జరుగుతోంది. చూస్తుంటే తమిళ సంప్రదాయంలో జరుగుతున్నట్టుంది. ఇదిలా ఉంటే.. వరుడు వధువు మెడలో తాళి కట్టే సమయంలో ఆ యువతి ఆనందంతో చప్పట్లు కొడుతూ తెగ ఆనందపడిపోయింది. తన మెడలో తాళి చూసుకుని మురిసిపోయింది. పట్టరాని సంతోషంతో కేరింతలు కొడుతూ మూడు ముళ్లు వేయించుకొని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఓ నెటిజన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘మీరు కూడా ఇలాగే ఉంటారా?’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తోందేమో..!’’.. ‘‘ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటే ఇలాంటి ఆనందమే ఉంటుంది మరి..’’ అంటూ ఈ కొత్త జంటను అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..