Archana Kamath: ప్రాణ దానం చేసి.. ప్రాణాలు కోల్పోయింది.! గొప్ప మనసు చాటుకున్న మహిళ.

Archana Kamath: ప్రాణ దానం చేసి.. ప్రాణాలు కోల్పోయింది.! గొప్ప మనసు చాటుకున్న మహిళ.

Anil kumar poka

|

Updated on: Sep 25, 2024 | 1:24 PM

సామాజిక సేవలో ముందుంటూ ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలిచే మహిళ ప్రాణదానం చేసి ప్రాణాలు విడిచిన ఘటన మంగళూరులో జరిగింది. బంధువుకు కాలేయం పాడైపోతే, సదరు మహిళ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసు చాటుకుంది. కానీ ఆరోగ్యం విషమించి ఆమే ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే.. ఉడుపికి చెందిన అర్చనా కామత్‌ మంగళూరులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు.

సామాజిక సేవలో ముందుంటూ ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలిచే మహిళ ప్రాణదానం చేసి ప్రాణాలు విడిచిన ఘటన మంగళూరులో జరిగింది. బంధువుకు కాలేయం పాడైపోతే, సదరు మహిళ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసు చాటుకుంది. కానీ ఆరోగ్యం విషమించి ఆమే ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే.. ఉడుపికి చెందిన అర్చనా కామత్‌ మంగళూరులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. తన బంధువైన వృద్ధురాలికి కాలేయం పాడైపోయి ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్యకర వ్యక్తి నుంచి కొంత కాలేయ భాగం తీసి అమర్చితే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. అనేక మందికి రక్త పరీక్షలు చేసినా సరిపోలేదు. అర్చన బ్లడ్‌ గ్రూప్‌తో సరిపోయింది. దీంతో అర్చన కాలేయ దానానికి ముందుకొచ్చింది. 12 రోజుల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అర్చనకు ఆపరేషన్‌ చేసి లివర్‌ భాగాన్ని తీసి వృద్ధురాలికి అమర్చారు. మూడురోజుల తరువాత అర్చన డిశ్చార్జ్‌ అయింది. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్చనకు రెండు రోజుల కిందట ఆకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో వెంటనే బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఆమెకు భర్త చేతన్‌ కామత్‌ తో పాటు నాలుగేళ్ల బాబు ఉన్నారు. ఆమె లివర్‌ను పొందిన వృద్ధురాలు మాత్రం ఆరోగ్యంగా ఉండడం విశేషం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.