కొత్తకారుతో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకుంటే.. ఇలాజరిగిందేంటి సామీ..
కొత్త కారు కొనుగోలు చేస్తే ఆ సంతోషం మాములుగా ఉండదు. షోరూమ్ నుంచి కారును ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఫుల్ జోష్‌తో ఉంటారు. ఇంట్లో ఉన్న వారికి తమ కారును తొలిసారి చూపించాలని తెగ ఆరాటపడుతుంటారు.
కొత్త కారు కొనుగోలు చేస్తే ఆ సంతోషం మాములుగా ఉండదు. షోరూమ్ నుంచి కారును ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఫుల్ జోష్‌తో ఉంటారు. ఇంట్లో ఉన్న వారికి తమ కారును తొలిసారి చూపించాలని తెగ ఆరాటపడుతుంటారు. ఇంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేయాలని భావిస్తుంటారు. ఓ వ్యక్తి కూడా అలాగే తన కొత్త కారును ఇంటికి గ్రాండ్‌గా తీసుకురావాలని ప్లాన్ చేశాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరోటి తలిచినట్లు జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త కారుతో ఇంటి గేట్‌లోకి బాగానే ఎంట్రీ ఇచ్చాడు సదరు యజమాని. అయితే ఆ తర్వాతే ఒక్కసారి కారు అదుపు తప్పింది. బహుశా బ్రేక్ వేయాల్సి ఉండి, ఎస్కలేటర్‌ను నొక్కినట్లున్నాడు పాపం.. కారు ఒక్కసారిగా అక్కడ పార్క్ చేసిన బైక్‌లపైకి దూసుకుపోయింది. అక్కడితో ఆగకుండా కారు బోల్తా కొట్టింది కూడా. అయితే అక్కడున్న వారు వెంటనే కారు వద్దకు చేరుకొని సహాయం చేయడంతో కారు పూర్తిగా కింద పడకుండా కాపాడగలిగారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ 76 మంది పిల్లల ఆస్తిపంజరాలు !! వణికిపోయిన శాస్త్రవేత్తలు !!
నడిరోడ్డుపై ఎలుగుబంట్ల మల్ల యుద్ధం.. చూస్తే వణుకే..
స్మార్ట్ పూలకుండీలు వచ్చేసాయ్.. వామ్మో ఎన్ని ఫీచర్లో..
రన్నింగ్ కారుపై పాము !! చుక్కలు చూసిన ప్రయాణికులు.. చివరికి ఏమైందంటే ??
సైకిల్‌పై 250 కి.మీ ప్రయాణించిన 13 ఏళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే షాక్ !!
