Brain Stroke: అలాంటి వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.! నిపుణుల షాకింగ్ న్యూస్..
అసలే ఇది వర్షాకాలం. వర్షాలతో పాటు దోమలను కూడా తీసుకొచ్చే కాలం. దోమకాటు ద్వారా ప్రాణాంతక డెంగ్యూ సోకే డేంజరస్ సీజన్. ఇప్పటికే అక్కడక్కడా ప్రాణాంతక డెంగ్యూ కేసులు బయట పడుతున్నాయి. డెంగ్యూ సోకితే అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఇప్పటి వరకు తెలుసు. కొన్ని తీవ్రమైన కేసుల్లో రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది. అయితే తాజాగా వైద్య నిపుణులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు.
అసలే ఇది వర్షాకాలం. వర్షాలతో పాటు దోమలను కూడా తీసుకొచ్చే కాలం. దోమకాటు ద్వారా ప్రాణాంతక డెంగ్యూ సోకే డేంజరస్ సీజన్. ఇప్పటికే అక్కడక్కడా ప్రాణాంతక డెంగ్యూ కేసులు బయట పడుతున్నాయి. డెంగ్యూ సోకితే అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఇప్పటి వరకు తెలుసు. కొన్ని తీవ్రమైన కేసుల్లో రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది. అయితే తాజాగా వైద్య నిపుణులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. ఇన్‌ఫెక్షన్ సోకిన మొదటి రెండు నెలల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని తెలిపారు. సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులే కాకుండా కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని, ప్రాణాంతకమైన స్ట్రోక్‌లకు కారణమవుతుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌గా పేర్కొనే తీవ్రమైన ప్లాస్మా లీకేజీ వల్ల మెదడు సహా కీలకమైన అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదని, ఇలాంటి పరిస్థితుల్లోనే స్ట్రోక్ ముప్పు ఉంటుందని న్యూరాలజిస్ట్ నిపుణులు అంటున్నారు. డెంగ్యూ వైరస్ కొన్నిసార్లు నరాల కణాలను ఆక్రమించి పనితీరును దెబ్బతీస్తుందని చెపుతున్నారు. మెదడు, వెన్నెముకలో వాపు ఏర్పడి కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.