Contaminated Drinking: ఆ తాగునీటితో క్యాన్సర్.. ఏం జరిగిందంటే.! వీడియో..
హానికారక రసాయనాలతో కలుషితమైన నీరు తాగి వృషణాల క్యాన్సర్ బారినపడ్డానంటూ అమెరికాలోని ఓహియో రాష్ట్రం ఏంగిలే ఉడ్ నగరానికి చెందిన 29 ఏళ్ల యువకుడు కోర్టులో కేసు వేశాడు. నీటి కాలుష్యానికి కారణమైన కెమికల్ కంపెనీలను కోర్టుకీడ్చాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను (PFAS) వాడే రెండు డజన్లకు పైగా కంపెనీల కారణంగా తమ తాగునీరు కలుషితమైందని ఆరాన్ అడ్కిన్స్ ఆరోపించాడు.
హానికారక రసాయనాలతో కలుషితమైన నీరు తాగి వృషణాల క్యాన్సర్ బారినపడ్డానంటూ అమెరికాలోని ఓహియో రాష్ట్రం ఏంగిలే ఉడ్ నగరానికి చెందిన 29 ఏళ్ల యువకుడు కోర్టులో కేసు వేశాడు. నీటి కాలుష్యానికి కారణమైన కెమికల్ కంపెనీలను కోర్టుకీడ్చాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను (PFAS) వాడే రెండు డజన్లకు పైగా కంపెనీల కారణంగా తమ తాగునీరు కలుషితమైందని ఆరాన్ అడ్కిన్స్ ఆరోపించాడు. 3ఎమ్, డూపాంట్ సంస్థలే దీనికి ప్రధానకారణమని పేర్కొన్నారు. సాధారణంగా మంటలను ఆర్పేందుకు వినియోగించే ఆక్వియ్ ఫిల్మ్ ఫార్మింగ్ ఫోమ్ తయారీలో PFAS రసాయనాలను వాడతారు. ఇప్పటికే అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ నీటి కాలుష్యంపై దృష్టి సారించింది. తాగునీటిలో పీఎఫ్ఏ రసాయనాల స్థాయిలను నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఆరాన్ అడ్కిన్స్ కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక కొన్నేళ్లపాటు పీఎఫ్ఏ రసాయనాలతో కలుషితమైన నీటిని తాగి ఆరాన్ క్యాన్సర్ బారినపడినట్టు ఫిబ్రవరిలో తేలింది. మరోవైపు, ఆరాన్ భార్య కూడా కోర్టును ఆశ్రయించింది. తన భర్త క్యాన్సర్ కారణంగా తాను నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. భాగస్వామి సాంగత్యానికి దూరమయ్యానని పేర్కొంది. ఇది చివరకు తన వివాహ బంధంపై ప్రతికూల ప్రభావం చూపించిందని తెలిపింది. నీటి కాలుష్యానికి బాధ్యులైన కంపెనీలు తమకు పరిహారం చెల్లించాలని తమ కేసులో వీరు కోరారు. నీటిలోని ఫ్లోరోరసాయన ఉత్పత్తుల కారణంగా జరిగే నష్టాల గురించి బాధ్యులైన కంపెనీలు తమను హెచ్చరించలేదని పేర్కొన్నారు. అగ్నిమాపక రసాయనాలతో పాటు నాన్‌స్టిక్ కుక్ వేర్ వంటి ఇతర రసాయనాల్లోనూ పీఎఫ్ఏఎస్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కెమికల్స్ చాలా ఏళ్ల పాటు అలాగే ఉండిపోతాయని, అధిక మోతాదుల్లో వీటి బారిన పడేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

