బోర్నవిటా అస్సలు హెల్త్ డ్రింకే కాదు… స్పష్టం చేసిన కేంద్రం
బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచి ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది.
బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచి ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది బోర్నవిటాకు మాత్రమే కాకుండా, ఈ కామర్స్ పోర్టళ్లలో హెల్త్ డ్రింకులుగా చలామణీలో ఉన్న అన్ని రకాల పానీయాలు, బేవరేజెస్ కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సెక్షన్ 14 ఆఫ్ CRPC యాక్ట్ 2005 కింద జరిపిన విచారణలో ఆరోగ్య పానీయాలు అంటూ ఏవీ లేవని నిర్ధారించినట్టు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. కాగా, బోర్నవిటాలో నిర్దేశిత స్థాయి కంటే చక్కెర మోతాదు అధికంగా ఉన్నట్టు NCPCR గుర్తించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడు కోరగానే రూ.40 లక్షలు పంపింది.. ఆ తర్వాత ??
సమాధుల వద్ద పోలీసులతో భద్రత.. అక్కడ అత్యవసర పరిస్థితి !!
ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
Heart Attack: మహిళలూ మీ గుండెలు జర భద్రం.. తాజా అధ్యయనాల్లో వెల్లడి