Heart Attack: మహిళలూ మీ గుండెలు జర భద్రం.. తాజా అధ్యయనాల్లో వెల్లడి

Heart Attack: మహిళలూ మీ గుండెలు జర భద్రం.. తాజా అధ్యయనాల్లో వెల్లడి

Phani CH

|

Updated on: Apr 13, 2024 | 11:49 AM

నెలసరి నిలిచిన తర్వాత అంటే మనోపాజ్‌ తర్వాత స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెనోపాజ్‌ తర్వాత స్త్రీలలో గుండె ఆరోగ్యం ఊహించిన దాని కన్నా వేగంగా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్నవయసులో గుండెపోటు రావడం అనేది చాలా తక్కువ. కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ఈ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నెలసరి నిలిచిన తర్వాత అంటే మనోపాజ్‌ తర్వాత స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెనోపాజ్‌ తర్వాత స్త్రీలలో గుండె ఆరోగ్యం ఊహించిన దాని కన్నా వేగంగా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారికి చిన్నవయసులో గుండెపోటు రావడం అనేది చాలా తక్కువ. కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ఈ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు. గుండెజబ్బు ముప్పు కారకాలు గల మగవారిని, నెలసరి నిలిచిన మహిళలను ఎంచుకొని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరంతా కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ వాడుతున్నవారే. గుండె రక్తనాళాల్లో ఎంత క్యాల్షియం పోగుపడిందో తెలిపే స్కోరును పరిశీలించగా.. మగవారిలో కన్నా నెలసరి నిలిచిన మహిళల్లో సగటున రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. నెలసరి నిలిచిన తర్వాత వీరిలో గుండె ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనం తెలియజేస్తోంది. నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో పూడికలు ఏర్పడే వేగం ఎందుకు పెరుగుతోంది అంటే.. చాలావరకూ ఈస్ట్రోజెన్‌ మోతాదులు వేగంగా తగ్గటమే అంటున్నారు. స్త్రీ హార్మోన్‌గా భావించే ఈస్ట్రోజెన్‌ లైంగిక పరమైన అంశాల్లోనే కాకుండా ఇతరత్రా పనుల్లోనూ పాలు పంచుకుంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిక్కిచ్చే న్యూస్.. హృతిక్ NTR మధ్య భీకర డ్యాన్స్‌ పోటీ..

భార్యకు నచ్చలేదని.. కోట్లు విలువ చేసే కారును లైట్‌ తీసుకున్న హీరో

Akhil Akkineni: నయా లుక్‌లో అందరికీ షాకిచ్చిన అఖిల్

Premalu: OTTలోకి వచ్చేసిన ప్రేమలు మూవీ..

Yatra 2: చడీచప్పుడు కాకుండా.. OTTలోకి వచ్చేసిన యాత్రా2

 

Published on: Apr 13, 2024 11:43 AM