కొత్తగా పెళ్లైన జంటకు బ్లూ డ్రమ్ గిఫ్ట్! ఆ ఘటన తలుచుకుని వరుడు షాక్
పెళ్లి అనగానే బంధుమిత్రులు, స్నేహితులు బహుమతులు అందించడం ఓ తంతు. స్తోమతకు తగ్గట్టు రకరకాల గిఫ్టులు సమర్పించుకుంటూ వారి పట్ల తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటారు. అయితే కొత్తగా పెళ్లైన ఓ జంటకు అరుదైన బహుమతి అందింది. వరుడి స్నేహితులు బ్లూ డ్రమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ఇది చూసి పెళ్లికొడుకు షాక్ కాగా, పెళ్లికూతురు తెగ నవ్వుకుంది. మీరట్ భయానక హత్యను గుర్తు చేసిన ఈ బ్లూ డ్రమ్ గిఫ్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక జంట వివాహం అనంతరం బంధుమిత్రులు బహుమతులు సమర్పించారు. ఈ సందర్భంగా వరుడి స్నేహితులు పెద్ద బ్లూ డ్రమ్‌తో వేదికపైకి చేరుకున్నారు. కొత్త జంటకు దీనిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది చూసి పెళ్లికొడుకు షాక్ కాగా, పెళ్లికూతురు తెగ నవ్వింది. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మీరట్‌లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమ్మెంట్‌తో నింపిన బ్లూ డ్రమ్ దాయడాన్ని ఇలా గుర్తు చేయడంపై కొందరు మండిపడ్దారు. ఇంతకంటే దారుణమైన జోక్ ఏముంటుంది! పెళ్లి లాంటి సంతోషకరమైన సందర్భంలో హాస్యాస్పదంగా ఒక హత్యను గుర్తుచేసుకోవడం సరికాదు అని ఒకరు విమర్శించారు. మరోవైపు ప్రపంచమంతా మానసిక వ్యాధిగ్రస్తులమయంగా మారిందని, మీరట్ మారణకాండను ఎగతాళి చేయడం పరిపాటిగా మారిందని మరొకరు మండిపడ్దారు. ఇలాంటి స్నేహితులున్న వారికి శత్రువులు అవసరం లేదని మరొక నెటిజన్ దుయ్యబట్టారు. ఈ మూర్ఖులు పెళ్లికూతురును రెచ్చగొడుతున్నారని మరొకరు విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగ సాలీడు డ్యాన్స్ నచ్చిందా ఓకే! లేదంటే హింసించి చంపేసే ఆడ సాలీడు
గూగుల్ డాట్ కాం కొన్న గుజరాతీ..! ఎంతకంటే ??
ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..!
సినిమా హీరోయిన్‌గా ‘గుప్పెడంత మనసు’ జగతి.. ఆంటీ టూ అందాల బ్యూటీ!
ఓ పక్క యుద్ధ పరిస్థితులంటే ఇంకో పక్క పాకిస్తానీతో దోస్తీనా..! ఛీ సిగ్గు చేటు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

