Tihar jail: ఏందయ్యా ఇది..? ఇదెక్కడి న్యాయం.. జైల్లో మంత్రికి మసాజ్.. ప్రత్యక్ష వీడియోలు లీక్..
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్‌ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు తీహార్ జైల్లో వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్త బయటికి రావడంతో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను సస్పెండ్ చేశారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్‌ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు తీహార్ జైల్లో వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్త బయటికి రావడంతో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా సత్యేంద్ర జైన్ జైల్లోనే మసాజ్ చేయించుకున్న వీడియోలు కూడా విడుదలయ్యాయి.ప్రస్తుతం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సత్యేంద్ర ఉంటున్న సెల్‌లో ఓ వ్యక్తి అతనికి కాళ్లు వత్తిన వీడియో బయటకు వచ్చింది. అంతే కాకుండా తలకు మసాజ్ చేయించుకున్న ఫుటేజ్ కూడా బయటకు రావడంతో.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా సెప్టెంబర్ నెలలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక జైన్ ఉన్న గదిలో ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఉన్నాయి. మినరల్ వాటర్ బాటిల్స్ కూడా కనిపించాయి. అజిత్‌ను సస్పెండ్ చేసిన కొద్ది రోజులకే ఈ వీడియోలు బయటకు వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..