Biggest Anaconda: సముద్రంలోకి స్కూబాడైవింగ్ వెళ్లిన వ్యక్తులు.. సముద్రం అడుగున భారీ అనకొండను చూసి షాక్.!
ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నోరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ భారీ అనకొండకు సంబంధించిన వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది.
ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నోరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ భారీ అనకొండకు సంబంధించిన వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. ఇద్దరు వ్యక్తులు స్కూబా డైవింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రం లోతుకు వెళ్లిన వారికి ఊహించని షాక్ తగిలింది. వారి ముందు ఒక పెద్ద అనకొండ దర్శనం ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత పెద్ద అనకొండను ఎప్పుడూ చూసిఉండరు. ఈ వీడియో బ్రెజిల్ కు చెందినదిగా తెలుస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు స్నేహితులు డైవింగ్ సూట్లు ధరించి నీటి అడుగుభాగానికి వెళ్లారు. ఒక వ్యక్తి చేతిలో కెమెరా ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆకుపచ్చ రంగులో భారీ అనకొండ కనిపించింది. అనకొండ మెల్లగా వాళ్ళ వైపు రావడం మొదలు పెట్టింది. దాన్ని చూడగానే వారిలో వణుకుపుట్టింది. అయితే ఆ అనకొండ కెమెరాకు దగ్గరగా వచ్చి ఆగింది. నాలుకను బయటకు తీస్తూ కనిపించింది. సాధారణంగా అనకొండ ఆహారం సువాసనను పసిగట్టేందుకు ఇలా చేస్తుంది. అయితే అది ఈ వ్యక్తుపై దాడి చేయలేదు. తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది. దాంతో స్కూబాడైవర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ అనకొండ దాదాపు 23 అడుగుల పొడవు ఉంటుందని, దాని బరువు 90 కిలోలు ఉంటుందని వారిలో ఒకరు చెప్పారు. అనకొండ కనిపించగానే.. కొంత సేపటి వరకు మౌనంగా ఉన్నామని చెప్పారు. CGTN షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించగా.. వేలాది మంది లైక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..