ఉత్తరప్రదేశ్‌లో బాహుబలి సీన్ రిపీట్.. అచ్ఛం శివగామిలా వీడియో
శత్రువుల నుంచి పసికందును కాపాడేందుకు, ఉప్పొంగుతున్న నదిలో ఒక చేత్తో బిడ్డను పైకెత్తి పట్టుకున్న శివగామి దృశ్యం 'బాహుబలి' సినిమాకే ప్రాణం పోసింది. ఇప్పుడు అలాంటిదే ఓ దృశ్యం నిజ జీవితంలో ఆవిష్కృతమైంది. కాకపోతే ఇక్కడ శివగామి పాత్రలో ఒక తండ్రి కనిపించాడు. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు , ప్రకృతి సృష్టించిన ప్రళయాన్ని సైతం లెక్కచేయకుండా సాహసం చేశాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, రోడ్లు… నదులను తలపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ కుటుంబానికి ఊహించని కష్టం ఎదురైంది. వారి పసిబిడ్డ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లక తప్పని పరిస్థితి. కానీ బయట ఎటుచూసినా నడుం లోతుకు పైగా వరద నీరు చేరడంతో వాహనాలు తిరిగే మార్గం లేదు. ఆ సమయంలో ఆ తండ్రి ఏమాత్రం ఆలోచించలేదు. తన బిడ్డను గుండెలకు హత్తుకుని, వరద నీటిలోనే ఆస్పత్రికి నడక ప్రారంభించాడు. భర్తకు తోడుగా భార్య కూడా ఆ నీటిలోనే నడుస్తూ అనుసరించింది. బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడిన ఆరాటం అక్కడున్న వారిని కదిలించింది.
మరిన్ని వీడియోల కోసం :
ఏకాంతం కోసం లాడ్జిలో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో
కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో
పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
