చిన్నదైనా పెద్దదైనా.. పాము పామే వీడియో
పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలని నానుడి. అందుకు సరిగ్గా సరిపోతుంది ఈ ఘటన. ఓ చిన్న నాగుపాము తనను తాను రక్షించుకోడాని కోళ్లపై తిరగబడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాములు తరచూ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. పైగా, ఇది పాములు గుడ్లు పెట్టే కాలం కూడా కావటంతో పలుచోట్ల పాముగుడ్లు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి.
తాజాగా, అలా గుడ్లనుంచి ప్రాణం పోసుకుని బయటకు వచ్చిన ఓ నాగుపాము కూన బయటి ప్రపంచంలోకి విహారానికి వచ్చింది. అయితే, ఆ పామును చూసిన రెండు కోళ్లు పెద్దగా అరుస్తూ దానిమీద దాడిచేశాయి. అయితే.. చిన్న కూన అయినా.. నాగుబాము ఏమాత్రం తగ్గలేదు. తనను తాను రక్షించుకోడానికి తన బుల్లి పడగ విప్పి కోళ్లపై ఎదురుదాడి చేసింది. దీంతో కోళ్లు కాస్త వెనక్కి తగ్గటంతో.. పాము పిల్ల మళ్లీ తన దారిన తాను పోయింది. అయితే, మళ్లీ కోళ్లు దాని వెంట పడి ముక్కులతో పొడుస్తూ పాముపై దాడి చేశాయి. కోళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి పాము తన వంతు ప్రయత్నం చేసినా ఫెయిల్ అయినట్లే అర్థమవుతుంది. వీడియో ఎండింగ్ పూర్తిగా లేనప్పటికీ.. ఆ పామును కోళ్లు తినేసి ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోల కోసం :
ఏకాంతం కోసం లాడ్జిలో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో
కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో
పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
