ఏకాంతం కోసం లాడ్జిలో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో
మీరు ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా? మాటముచ్చట కోసం పార్క్‌కి వెళ్లకుండా లాడ్జీకి వెళ్తున్నారా? అయితే జర భద్రం. రూమ్‌లో కంటికి కనిపించని నిఘా నేత్రాలు మిమ్మల్ని స్కాన్ చేస్తుంటాయి. మీరేం చేసినా ఇట్టే పట్టేస్తుంటాయి. మ్యాటర్ అక్కడితో ఆగదు.. బ్లాక్‌మెయిల్‌తో జీవితాలను బర్‌బాజ్ చేసే కుట్ర జరుగుతోంది. ఇంతకీ ఎక్కడనేగా మీ డౌట్.. మీరే చూడండి.
భద్రాచలంలోని శ్రీ రాఘవ రామ లాడ్జి అది. కొద్దిరోజుల క్రితం ఓ ప్రేమజంట ఈ లాడ్జీకి వెళ్లింది. ఓ రూమ్ అద్దెకు తీసుకుంది. కొన్ని గంటలు లాడ్జిలో ఉండి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్లకు ఓ కాల్ వచ్చింది. ఫలానా లాడ్జీలో మీ మీటింగ్ వీడియో.. మా చేతిలో ఉంది.. డబ్బు ఇస్తే సరి అంటూ కాల్ కట్ చేశారు. ఆ మాట విని ప్రేమికులిద్దరూ షాకయ్యారు. షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి కాల్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని చెప్పడంతో.. వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. పరువు పోతుందని భావించిన ప్రియురాలు.. తన దగ్గరున్న బంగారాన్ని అమ్మి వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేసింది. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన లాడ్జీ సిబ్బంది.. మళ్లీ ఆ.. జంటకు కాల్ చేసి మరో లక్ష అడిగారు. ఇదిలాగే కంటిన్యూ అవుతుందని భావించిన ప్రేమికులు.. కాస్త ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించారు. జరిగిందంతా వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. లాడ్జీకి వెళ్లి రూమ్‌లో అమర్చిన కెమెరాలు, డిజిటల్ ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. లాడ్జీ యజమాని మాత్రం సీక్రెట్ కెమెరాలతో షూట్ చేసిన విషయాన్ని ఖండించారు. సదరు యువకుడు ఇలాగే కొంతమందిని బెదిరించినట్టు తెలిసిందని.. తప్పని తేలితే చర్యలు తీసుకోవాలన్నాడు. కాగా, ప్రైవసీ కోరుకున్న ప్రేమికులు చివరికి చిక్కుల్లోపడ్డారు. నిజంగానే లాడ్జీ సిబ్బంది ప్రేమజంట వీడియోలు తీశారా? లేదంటే ఊరికే డబ్బు కోసం బెదిరిస్తున్నారా? పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటికొస్తాయన్నది వేచి చూడాలి.
మరిన్ని వీడియోల కోసం:
ఏటీఎంలో మనీ కాదండోయ్ బుసలు కొట్టే నాగుపాము.. వీడియో చూస్తే వణకాల్సిందే !
షాకింగ్ : హీరోయిన్ బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ వీడియో
ఏం సినిమా రా బాబూ.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్ వీడియో
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

