ఏటీఎంలో మనీ కాదండోయ్ బుసలు కొట్టే నాగుపాము.. వీడియో చూస్తే వణకాల్సిందే !
ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త.. డబ్బులకు బదులు పాములు బయటకు రావచ్చు... అవును.. ఇందుగలడందులేడను సందేహము వలదు అన్నట్టుగా ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి. ఏసీలు, కార్లు, బైకులు ఒకటేమిటి ఎక్కడ చూసినా పాములే పాములు.. ఆఖరికి ఏటీఎంలను కూడా వదలడంలేదు పాములు. ఏటీఎంలో క్యాష్ నింపుదామని వెళ్లిన బ్యాంకు సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది.
క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగానే బుస్‌మంటూ పడగవిప్పింది నాగుపాము. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆ రోజు బ్యాంక్‌లో ఎప్పటిలానే క్యాష్ బాక్స్‌లను సిద్దం చేశారు. ఏటీఎంలో క్యాష్ నింపేందుకు ఫుల్ సెక్యూరిటీతో బాక్స్‌లలో నుంచి డబ్బును తీస్తున్నారు. ఓ క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా పడగవిప్పి పైకిలేచిన నాగుపామును చూసి బ్యాంక్ సిబ్బందితో పాటు అందరూ షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. క్యాష్ బాక్స్‌ను ఓపెన్ చేయగానే బుసలు కొడుతూ నాగుపాము బయటకు రావడంతో భయంతో దూరంగా జరిగారు బ్యాంకు సిబ్బంది. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును జాగ్రత్తగా పట్టుకొని బ్యాంక్ ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం దానిని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో
కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?
విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో
తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
