Hyderabad: కన్ను బాగు చేస్తారనుకుంటే ప్రాణం తీసేశారు.! ఏం డాక్టర్ రా బాబు నువ్వు..

Hyderabad: కన్ను బాగు చేస్తారనుకుంటే ప్రాణం తీసేశారు.! ఏం డాక్టర్ రా బాబు నువ్వు..

Anil kumar poka

|

Updated on: Nov 29, 2024 | 3:05 PM

కంట్లో కర్ర ముక్క గుచ్చుకుని ఆరేళ్ల చిన్నారిని ఆసుపత్రికి తీసుకొస్తే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ పాప ప్రాణాలు గాల్లో కలిసాయి. మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో పాప చనిపోయింది. ఘటన హైదరాబాద్‌ హబ్సిగూడలోని ఆనంద్ కంటి ఆసుపత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరుకి చెందిన రవి మౌనిక దంపతులు పటాన్‌చెరువు సమీపంలో బీరంగుడా లో నివాసం ఉంటున్నారు.

రవి స్థానికంగా ఓ బోర్‌వెల్‌ ఏజెన్సీలో సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. వారి కుమార్తె హన్విక ఇంటి ముందు ఆడుకుంటుండగా కర్ర ముక్క కంట్లో గుచ్చుకుంది వెంటనే చందానగర్ లోని ఆనంద్ ఐ హాస్పిటల్ కి తరలించారు. కంటి చుక్కల మందు ఇచ్చి ఇంటికి పంపించి వేసిన వైద్యులు కాసేపటికి ఫోన్ చేసి హబ్సిగూడలో ఉన్న తమ ఆసుపత్రి బ్రాంచ్ కు తీసుకువెళ్లాలని సూచించారు దీంతో శుక్రవారం మధ్యాహ్నం హబ్సిగూడలోని ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్లు ముక్కు ద్వారా మత్తుమందు ఇచ్చినట్లు తెలిసింది. మోతాదుకు మించిన మత్తుమందు ఇవ్వడంతో చిన్నారి అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. పరిస్థితి విషమించడంతో విషయాన్ని దాచిపెట్టిన ఆసుపత్రి యాజమాన్యం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హుటాహుటిన ఎల్‌బీనగర్‌లోని రెయిన్బో హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే చిన్నారి కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు. రెయిన్బో హాస్పిటల్ ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనంద హాస్పిటల్ డాక్టర్లను నిలదీశారు. చిన్నారి మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించకపోవడంతో రాత్రి 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మోతాదుకు మించి ఇచ్చిన మత్తుమందు వల్ల తమ కుమార్తె చనిపోయిందని రవి మౌనిక దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.