Viral Video: ఈ చిన్నారి అమాయక చేష్టలకు మిలియన్లమంది నెటిజన్లు ఫిదా
బాల్యం ఎంతో మధురమైనది. తెలిసీ తెలియని వయసులో చేసే అల్లరి జీవితాంతం గుర్తుండిపోతుంది. మరోవైపు సోషల్ మీడియాకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.
బాల్యం ఎంతో మధురమైనది. తెలిసీ తెలియని వయసులో చేసే అల్లరి జీవితాంతం గుర్తుండిపోతుంది. మరోవైపు సోషల్ మీడియాకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లవాడు నీటి పైపుతో ఆడుకుంటున్నాడు. అక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. అతను పైపుతో ఆడుకుంటున్న సమయంలో పైపు నుంచి నీళ్లు వస్తున్నాయి. కాగా ఆ చిన్నారి పైపు సహాయంతో నీటిని గార్డెన్ లో పోసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ చిన్నారి ఊహించని విధంగా నీళ్లు తనపై పడుతుంటాయి. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయో అర్థం కాక చూట్టూ తిరిగి చూస్తాడు. అయినా ఏం జరుగుతుందో తెలియక బిక్కమొహం వేస్తాడు. ఈ వీడియో ఫేస్ బుక్ లో పోస్ట్ అయింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మిలియన్లమంది వీక్షిస్తూ లక్షల్లో లైక్ చేస్తున్నారు. దీనిపై వివిధ రకాల కామెంట్‌లు, రియాక్షన్‌లను కూడా ఇస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ప్రతి అబ్బాయి రెండు పెళ్లి చేసుకోవాలి !! లేదంటే జైల్లో వేస్తారు !!
Viral: కాటేసిన పామును.. కసిదీరా నమిలి చంపేసిన చిన్నారి !!
Viral: ఇంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎప్పుడైన చూశారా ??
Kashmir: 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్
Ram Gopal Varma: RRR, KGF2 కంటే కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్..