Viral: కాటేసిన పామును.. కసిదీరా నమిలి చంపేసిన చిన్నారి !!
టర్కీలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసకుంది. కాటు వేసిన పామును ఓ బాలిక పసపసా నమిలేసింది. అవును మీరు విన్నది నిజమే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీనే ఈ పని చేసింది.
టర్కీలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసకుంది. కాటు వేసిన పామును ఓ బాలిక పసపసా నమిలేసింది. అవును మీరు విన్నది నిజమే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీనే ఈ పని చేసింది. వినేందుకు కాస్త షాకింగా ఉన్న ఇది నిజం. అయితే అలా పామును నోటిలో పెట్టుకుని నమిలేసిన ఆ పాపకు ఏం అయింది.? టర్కీలోని బింగోల్ నగరంలో ఉన్న కాంటార్ అనే చిన్న గ్రామంలో ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలికను పాము కాటువేసింది. తండ్రి పనికి వెళ్లాడు. తల్లి ఇంట్లో పనులు చేస్తుంది. ఆ సమయంలో బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఎటు నుంచి వచ్చిందో గానీ.. ఓ పాము బాలిక వద్దకు వెళ్లి.. ఆ చిన్నారిని కాటేసింది. దాదాపు అరమీటరు పొడవున్న పాము.. బాలిక పెదాలపై కరిచింది. పాము కరవడంతో పాపకు కోపం వచ్చి, వెంటనే దానిని చేత్తో తీసుకొని.. నోట్లో పెట్టుకుని గట్టిగా కొరికేసింది. ఎడా పెడా కొరికేయడంతో ఆ పాము చనిపోయింది. అనంతరం పాప బిగ్గరగా ఏడవడంతో.. తల్లి పరుగెత్తికొచ్చింది. బాలిక నోటికి రక్తపు మరకలు ఉండడం.. అక్కడే ఓ పాము చనిపోయి ఉండడం.. దానిపై పంటి గాట్లు ఉండడంతో.. తల్లి కంగారుపడింది. తన కూతురు పామును కొరికి చంపిందిని అర్ధమయింది. అదే సమయంలో పాప పెదాలపై పాము కాటేసిన ఆనవాళ్లు ఉండడంతో.. భయపడిపోయింది. ఇరుగుపొరుగు వారి సాయంతో.. హుటాహుటిన బింగోల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పాపకు ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు బేబీ ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ఇంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎప్పుడైన చూశారా ??
Kashmir: 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో ప్రారంభంకానున్న సినిమా థియేటర్
Ram Gopal Varma: RRR, KGF2 కంటే కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

