annavaram: వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.

annavaram: వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 08, 2024 | 11:07 PM

హిందూ సంప్రదాయంలో ప్రకృతి ఆరాధన ఉంటుంది. రకరకాల చెట్లను దేవతా వృక్షాలుగా భావించి పూజిస్తారు..ఆరాధిస్తారు. అలా చేయడం వల్ల తమకు ఏవైనా దోషాలు ఉంటే పోతాయని నమ్ముతారు. వీటిలో రావిచెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజిస్తారు. రావి చెట్టు వద్ద దీపం వెలిగించి, అనంతరం ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వసిస్తారు. ఇప్పుడు ఆ రావిచెట్టు లక్ష్మీస్వరూపంగా మారి ఓ ఆలయానికి కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఓ రావిచెట్టు ఉంది. గర్భాలయంలో శ్రీరమా సమేతంగా సత్యనారాయణుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయం ఎదుట విష్ణుస్వరూపమైన రావి చెట్టు రూపంలో పూజలందుకుంటున్నారు. ఈ రావిచెట్టు వద్ద దీపాలు వెలిగిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ రావిచెట్టు వద్ద దీపాలు ఉంచి పూజలు చేస్తారు. ఈ క్రమంలో అక్కడ భక్తుల సౌకర్యార్థం ఆవునెయ్యితో దీపాలు సిద్ధం చేసి విక్రయిస్తుంటారు. ఈ దీపాలను విక్రయించేందుకు వేలం పాట నిర్వహిస్తారు. ఆ వేలంలో పాడుకున్నవారు అక్కడ దీపాలు విక్రయం చేసుకోవచ్చు. ఈ వేలం పాట కోసం వ్యాపారులు పోటీపడతారు. అలా వేలం పాటద్వారా ఆలయానికి సుమారు కోటి రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వేలం నిర్వహించారు. క్రితం ఏడాది కంటే ఈ ఏడాది భారీగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హుండీ ద్వారా కూడా నాలుగు లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.