Kurnool: వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
కర్నూలు జిల్లాలో వింత ఆచారం అమలులో ఉంది. ఇక్కడ గ్రామస్తులంతా కలిసి కులమతాలకతీతంగా అందరూ ఒక చోట చేరి సహపంక్తి భోజనం చేయడం అక్కడి సంప్రదాయంగా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఆ గ్రామం ఐక్యతను చాటుతోంది. ఏటా కార్తీక మాసం ముగిసిన అనంతరం వచ్చే సోమవారం రోజు గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని, కరువు కాటకాలు ఉండవని వారి విశ్వాసం.
కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పూర్వం ఈ గ్రామం కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో గ్రామస్తులంతా కలిసి గ్రామదేవత గర్జప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, ప్రతి ఒక్కరూ తమ ఇంటినుంచి అన్నం వండుకొని తీసుకొచ్చి పెద్ద రాశిలా పోసి స్వామివారికి నైవేద్యం సమర్పించి, ఆ నైవేద్యాన్ని గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజనంగా చేసేవారు. అప్పటినుంచి ఆ గ్రామంలో కరువు కాటకాలు లేవని స్థానికులు చెబుతారు. అప్పటినుంచి ఈ ఆచారం తాము తప్పక పాటిస్తామని తెలిపారు. ఏటా కార్తీక మాసం తర్వాత వచ్చే మొదటి సోమవారం గ్రామంలోని ప్రతి ఇంటినుంచి ఎంతో నిష్టతో ఇంటిల్లిపాదికీ సరిపడా భోజనం సిద్ధం చేసుకొని గర్జప్పస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడ గ్రామపెద్దలు, పూజారులు.. ఈ అన్నప్రసాదాన్ని ఆలయంలో స్వామివారి ముందు పెద్ద రాశిగా పోసి నివేదన చేస్తారు. అనంతరం ఆలయం ఎదుట అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. కుల,మత, వయో భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.