Pizza In Space: వ్యోమగాములు పిజ్జా తినడానికి ఎంతలా కష్టపడతారో తెలుసా.? ఓ సారి వీడియో చూడండి.

Pizza In Space: సాధారణంగా మనకు పిజ్జా తినాలనిపిస్తే ఏం చేస్తాం చెప్పండి..? ఏముంది పిజ్జా షాప్‌కి వెళ్లి కొనుగోలు చేస్తాం. లేదా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకొని ఎంచక్కా...

Pizza In Space: వ్యోమగాములు పిజ్జా తినడానికి ఎంతలా కష్టపడతారో తెలుసా.? ఓ సారి వీడియో చూడండి.

Updated on: Aug 29, 2021 | 8:08 PM

Pizza In Space: సాధారణంగా మనకు పిజ్జా తినాలనిపిస్తే ఏం చేస్తాం చెప్పండి..? ఏముంది పిజ్జా షాప్‌కి వెళ్లి కొనుగోలు చేస్తాం. లేదా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకొని ఎంచక్కా తినేస్తామని చెబుతారా.? ఎవరైనా ఇదే సమాధానం చెబుతారు. కానీ వ్యోమగాములు పిజ్జా తినడానికి ఎంతలా కష్టపడతారో తెలుసా. అంతరిక్షంలో భూమాకర్షణ లేని ప్రదేశంలో తమ పిజ్జాను తామే తయారు చేసుకొని తినాల్సి ఉంటుంది. అంతరిక్షంలో వ్యోమగాములు పిజ్జాను తయారు చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న కొంత మంది వ్యోమగాములు పిజ్జా పార్టీ చేసుకున్నారు. పిజ్జాను తామే తయారు చేసుకొని తినేశారు. అయితే ఇదంతా అంత సులభంగా కాలేదు.. గాల్లోకి ఎగురుతోన్న ఆహార పదార్థాలను పట్టుకుంటూ నానా కష్టాలు పడ్డారు. దీనంతటికీ సంబంధించిన వీడియోను.. థామస్‌ అనే వ్యోమగామి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

ఈ పిజ్జా పార్టీ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న ఈ ఫ్లోటింగ్‌ పిజ్జా పార్టీ.. భూమిపై జరుపుకునే వీకెండ్‌ పార్టీలాగే అనిపిస్తోంది. ఒక మంచి చెఫ్‌ తన వంట సీక్రెట్‌ను ఎప్పటికీ బయటకు చెప్పడని నా స్నేహితులు అన్నారు. కానీ నేను దీనంతటినీ వీడియో తీశాను. ఎలా ఉందే మీరే నిర్ణయించాలి’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. మరి వ్యోమగాములు పిజ్జా తినడానికి ఎంతలా కష్టపడ్డారో మీరూ చూసేయండి.

Also Read: 500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?

Viral Video: పతకం గెలిచిన ఆనందంలో డాన్స్ చేసిన భారత అథ్లెట్.. ఆమె స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..!

Telangana Corona Cases: తెలంగాణలో తగ్గుతున్న కరోనా వైరస్.. కొత్తగా 257 మందికి కోవిడ్ పాజిటివ్