Sumi Bora Scam: అస్సాం నటి భారీ స్కాం.. రూ.2 వేల కోట్ల స్కామ్ లో ఆమె భర్త అరెస్ట్.!
అస్సాంలో కలకలం సృష్టించిన రూ.2 వేల కోట్ల ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణంలో గురువారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నటి సుమి బోరాను అరెస్టు చేశారు. సుమి బోరాతో పాటు ఆమె భర్త తార్కిక్ బోరాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పెట్టుబడి రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో జనాల నుంచి భారీ ఎత్తున సొమ్మును సమీకరించారు.
అస్సాంలో కలకలం సృష్టించిన రూ.2 వేల కోట్ల ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణంలో గురువారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నటి సుమి బోరాను అరెస్టు చేశారు. సుమి బోరాతో పాటు ఆమె భర్త తార్కిక్ బోరాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పెట్టుబడి రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో జనాల నుంచి భారీ ఎత్తున సొమ్మును సమీకరించారు. ఈ కుంభకోణం సుమారు రూ.2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన 60 రోజుల్లో పెట్టుబడులపై 30 శాతం రాబడి వస్తుందని నమ్మబలికాడు. అలా భారీ మొత్తంలో దండుకుని అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడు. దీనికోసం నాలుగు నకిలీ సంస్థలను కూడా స్థాపించాడు. విశాల్ అరెస్టు తర్వాతే బోరా దంపతులను పోలీసులు విచారణకు పిలిచారు. అయితే, బోరా దంపతులు హాజరుకాలేదు. దాంతో వీరిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి గురువారం వారిని అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.