AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూటు మార్చిన పులస.. ఇక గోదావరికి రానంటుంది.. ఎందుకో

రూటు మార్చిన పులస.. ఇక గోదావరికి రానంటుంది.. ఎందుకో

Phani CH
|

Updated on: Jul 21, 2025 | 4:53 PM

Share

పుస్తులమ్మైనా పులస తినాల్సిందే అన్నది గోదావరి జిల్లాల్లో నానుడి. వర్షాకాలంలో గోదావరికి వరదనీరు పోటెత్తినప్పడు ఈ పులసల సీజన్‌ మొదలవుతుంది. సముద్రాన్ని ఎదురీదుతూ సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి వస్తాయి ఇలస చేపలు. గోదావరి బురదనీరు తాకగానే అవి తమ రంగు,రూపు, రుచిని మార్చుకుంటాయి. అప్పటివరకూ ఇలసగా ఉన్న చేప కాస్తా పులసగా మారుతుంది.

సంతానోత్పత్తికోసం అవి వస్తే.. ఈ రుచికరమైన చేపలు ఎప్పుడెప్పుడు తిందామా అని మాంసప్రియులు ఎదురుచూస్తుంటారు. వీటికోసం మత్స్యకారులకు సీజన్‌ స్టార్ట్‌ అవగానే మందుగానే పడిన పులస మాకే ఇవ్వాలంటూ కొందరు బయానాలు కూడా ఇచ్చేస్తున్నారు. అట్లుంటది మరి పులస అంటే. జులై నుంచి అక్టోబరు వరకు ఈ పులసన సీజన్‌ కొనసాగుతుంది. ఈ సమయంలో సముద్రం నుంచి గోదావరి నదిలోకి పులసలు ఎదురీదుతూ వచ్చి ఇక్కడ పిల్లలు పెట్టి వాటితో తిరిగి వెళ్లే క్రమంలో జాలర్లకు చిక్కుతాయి. గ్రామంలో ఎవరైనా పులస కూర వండుకుంటే.. ఊరంతా ఆ విషయాన్ని ఆ రోజు గొప్పగా చెబుతుంటారు. ఈ క్రమంలో పులస వస్తే ముందుగా తనకే ఇవ్వాలని అమలాపురానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి బోడసకుర్రు ప్రాంతంలో పులసలు అమ్మే మత్స్యకార మహిళలకు రూ.5 వేలు అడ్వాన్స్ నెల రోజుల నాడే ఇచ్చాడట. అలాగే, అల్లవరం మండలం రెబ్బనపల్లికి చెందిన చేపల వ్యాపారి సాయికి ముందుగానే నేతలు, అధికారులు ఫోన్ లోనే ఆర్డర్ చేస్తారట. ప్రముఖులను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు, తమ ఆత్మీయులకు ప్రేమగా మరికొందరు ఈ సీజన్‌లో వీటిని కొని పంపుతుంటారు. జిల్లాలోని బడా వ్యాపారులు, గుత్తేదారులు, శ్రీమంతులు సైతం ఈ సీజన్ వస్తే.. పులస కోసం ఎదురుచూచ్తారు. కాగా, గతంలో గోదావరిలో బాగా దొరికిన పులసలు.. కొన్నేళ్ల నుంచి తగ్గుతూ పోతున్నాయి. బంగాళాఖాతంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల పులసలు తమ గమనాన్ని మార్చుకొని ఉండొచ్చని గోదావరిలోకి గాక.. ఇతర జల ప్రవాహాల వైపు మళ్లి ఉండొచ్చని మత్య్స శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.దీనిపై జాలర్లకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం కంటే వేగం ఈ రైలు.. గంటకు 600 కి.మీ

కంటి చూపును ఇచ్చే శైవక్షేత్రం వెల్లీశ్వరర్‌

మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్‌ తీసుకున్నారా? ఏం చేయాలంటే

ఎంత లాగినా ఒడ్డుకు రాని వల.. తీరా చూస్తే షాక్‌! జాలరి దశ తిరిగిపోయింది

వార్నీ.. వాడిన పాత బ్యాగ్ ధర రూ.85 కోట్లా!