AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి కరెంట్‌ బిల్లు చూసి షాక్‌ తిన్న రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌.. ఏకంగా

ఇంటి కరెంట్‌ బిల్లు చూసి షాక్‌ తిన్న రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌.. ఏకంగా

Phani CH
|

Updated on: Jul 21, 2025 | 5:15 PM

Share

సాధారణంగా కొన్ని సందర్భాల్లో కరెంట్‌ షాక్‌ కొడుతుంది. తడిచేతులో స్విచ్‌లు పట్టుకున్నా, వర్షాకాంలో తరచూ విద్యుత్‌ తీగలు తెగి పడినప్పుడు చాలామంది విద్యుదాఘాతానికి గురవుతుంటారు. కానీ ఇటీవల కాలంలో కరెంట్‌ కాదు.. కరెంట్‌ బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. అవును సామాన్యుల పూరిళ్లకు లక్షల్లో బిల్లులు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

సాంకేతిక లోపమో.. సిబ్బంది తప్పిదమో.. కారణమేదైనా కరెంటు బిల్లులు ఇంటి యజమానులకు కంగారు పుట్టిస్తున్నాయి. తాజాగా ఓ రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి అలాగే షాకయ్యారు. అవును మరి.. ఒకనెల కరెంటు బిల్లు లక్షల్లో వస్తే షాకవ్వరా..! సాధారణంగా మధ్యతరగతి కుటుంబానికి ఓ నెల కరెంట్ బిల్లు రూ. 1000 లేదా రూ. 1100 వస్తుంది. మహా అయితే రూ. 1500 అంతకముంచి రాదు. కానీ ఇక్కడ ఓ టీచర్ ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ. 15 లక్షలు వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన నన్నేషా హుస్సేన్ అనే రిటైర్డ్ టీచర్ ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ. 15,14,993 వచ్చింది. దీంతో ఆ కరెంట్ బిల్లు చూసిన ఆయన లబోదిబోమంటున్నారు. ప్రతినెలా రూ. 1300 వచ్చే కరెంట్ బిల్లు.. జూలై లో రూ. 15,14,993 రావడంపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌పై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డిజిటల్ మీటర్లు వేసినప్పటి నుంచి సామాన్యులకు నెత్తిన కరెంట్ బిల్లులు భారం ఎక్కువ అయ్యిందని.. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు

భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. డేంజర్లో పడ్డట్లే!

విమానం కంటే వేగం ఈ రైలు.. గంటకు 600 కి.మీ

కంటి చూపును ఇచ్చే శైవక్షేత్రం వెల్లీశ్వరర్‌

మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్‌ తీసుకున్నారా? ఏం చేయాలంటే