కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. స్కాన్ చేసి డాక్టర్లు షాక్ !!

కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. స్కాన్ చేసి డాక్టర్లు షాక్ !!

Phani CH

|

Updated on: Feb 10, 2023 | 9:33 AM

ఓ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆమెను స్కాన్ చేసిన డాక్టర్లు.. వచ్చిన రిపోర్టులు చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరామా నర్సింగ్‌ హోమ్‌లో చోటుచేసుకుంది.

ఓ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆమెను స్కాన్ చేసిన డాక్టర్లు.. వచ్చిన రిపోర్టులు చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరామా నర్సింగ్‌ హోమ్‌లో చోటుచేసుకుంది. 14ఏళ్ల బాలిక అన్నం తినడంలేదని, తరచూ వాంతులు చేసుకుంటూ క్రమంగా చిక్కిపోతోందని పట్టణానికి చెందిన ఆమె తల్లిదండ్రులు 15 రోజుల క్రితం నర్సింగ్‌ హోమ్‌కు తీసుకొచ్చారు. వైద్యుడు పొట్లూరి వంశీకృష్ణ పలు పరీక్షలు చేసి ఆమెకు జుత్తు తినే అలవాటుందని గుర్తించి ఎండోస్కొపి తీయించారు. బాలిక కడుపులో కణితి మాదిరిగా జుట్టు పేరుకుపోయి కనిపించింది. దీంతో ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న కిలోకు పైగా బరువున్న జుత్తును తొలగించారు. రక్తహీనత వల్ల 20 ఏళ్లలోపు బాలికల్లో జుత్తు తినే అలవాటు ఉంటుందని డాక్టర్‌ పొట్లూరి వంశీకృష్ణ తెలిపారు. 15 వేల మందిలో ఒకరికి ఇలాంటి అలవాటు ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ అనంతరం బాలిక ఆరోగ్యం కుదుటపడిందని అన్నారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీస్‌ కారునే దొంగించి !! చావు అంచులా దాకా వెళ్లొచ్చాడు !!

Ram Charan: లీకులతో తలపట్టుకుంటున్న రామ్‌ చరణ్‌

Prabhas: జోతిష్యం ఎఫెక్ట్ కాదురా.. జ్వరం ఎఫెక్ట్..

Prabhas: ఒక్కడు చేసిన పనితో.. ప్రభాస్‌కు ఎన్ని కష్టాలు !!

Ram Charan: ‘లియో’లో చెర్రీ.. దద్దరిల్లిపోనున్న ఎంట్రీ !!

 

Published on: Feb 10, 2023 09:33 AM