Viral video: మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతున్న వ్యక్తి.. 2 మీటర్లు తవ్వగా కళ్లు జిగేల్… వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Aug 20, 2022 | 11:34 AM

ఓ వ్యక్తి మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన కుమారుడితో కలిసి గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో రెండు మీటర్ల లోతువరకు తవ్వేసరికి ఏదో మెరుస్తూ కనిపించింది...


ఓ వ్యక్తి మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన కుమారుడితో కలిసి గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో రెండు మీటర్ల లోతువరకు తవ్వేసరికి ఏదో మెరుస్తూ కనిపించింది. జాగ్రత్తగా దానిని పైకి తీసి చూసిన అతని కళ్లు జిగేల్‌ మన్నాయి. ఈక్రమంలో తవ్వడం కొనసాగించిన అతను ఆశ్చర్యపోయాడు. అసలేం జరిగిందంటే…

కంబోడియా ప్రావిన్స్ వాయువ్య ప్రాంతంలోని కోర్క్‌వాట్‌ గ్రామానికి చెందిన బోయిన్‌ రాన్‌ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి మరగుదొడ్డి కట్టేందుకు గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక నీలిరంగు రాయి కనిపించింది. దానిని తీసి శుభ్రపరిచి చూడగా అదొక పురాతన కాంస్య విగ్రహంగా గుర్తించారు. అలా ఇంకొంచం తవ్వగా మరో నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని తన ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుని శాంతిని కోరుతూ వాటి ముందు ధూపం వెలిగించాడు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అతని ఇంటికి చేరకున్న పోలీసులు ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత, విగ్రహాలను ప్రావిన్షియల్ మ్యూజియంలో ఉంచుతామని తెలిపారు. ఈ పురాతన విగ్రహాలు 10 లేదా 11వ శతాబ్దానికి చెందిన థోబ్ బాఫున్ శైలిలో ఉన్నాయని ఒక పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu