Rakhi to Leopard: ఈమెకెంత ధైర్యం..చిరుతపులికే రాఖీ కట్టింది.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
అన్న చెల్లెలు, అక్క- తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ. ప్రతి ఏడాది వచ్చే ఈ పండగ దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కులం, వర్గం, చిన్న, పెద్ద తేడా అనేది లేకుండా..
అన్న చెల్లెలు, అక్క- తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ. ప్రతి ఏడాది వచ్చే ఈ పండగ దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కులం, వర్గం, చిన్న, పెద్ద తేడా అనేది లేకుండా… వేడుక చేసుకుంటారు. అయితే రాజస్థాన్ కు చెందిన ఓ మహిళ మాత్రం… వినూత్నంగా పండగ చేసుకుంది. ఏకంగా చిరుతపులికి రాఖీ కట్టి… తన ఆత్మీయతను చాటుకుంది. రాజస్థాన్ లో ఓ చిరుతపులి గాయపడింది. దీంతో అనారోగ్యానికి గురైంది. ఈ చిరుతను అటవీశాఖకు అప్పగిస్తున్న క్రమంలో… ఓ మహిళ దాని కాలికి రాఖీ కట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద శుక్రవారం తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. జంతువుల పట్ల భారతీయులు అమితమైన ప్రేమను కనబరుస్తూ వాటితో సామరస్యంగా ఉంటారంటూ రాసుకొచ్చారు. కాగా ఈ ఫోస్ట్… సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో పోస్టును లైక్ చేయగా… వందలమంది రిట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు రాఖీ బంధాన్ని గుర్తు చేస్తూ ట్వీట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

