Viral Video: సంతోషంగా జీవించడానికి కచ్చితంగా డబ్బే కావాలా.. ఆసక్తికర వీడియో పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర..

Viral Video: సంతోషంగా జీవించాలంటే ఏం కావాలి.? ఈ ప్రశ్నకు ఎవరైనా టక్కున చెప్పే సమాధానం డబ్బు. మనీ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు, ఎంతటి ఆనందాన్ని అయినా పొందొచ్చని అందరూ భావిస్తుంటారు...

Viral Video: సంతోషంగా జీవించడానికి కచ్చితంగా డబ్బే కావాలా.. ఆసక్తికర వీడియో పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర..

Updated on: Dec 25, 2021 | 5:57 PM

Viral Video: సంతోషంగా జీవించాలంటే ఏం కావాలి.? ఈ ప్రశ్నకు ఎవరైనా టక్కున చెప్పే సమాధానం డబ్బు. మనీ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు, ఎంతటి ఆనందాన్ని అయినా పొందొచ్చని అందరూ భావిస్తుంటారు. అయితే సంతోషానికి, డబ్బుకు సంబంధమే లేదని.. జీవితాన్ని హ్యాపీగా గడపడానికి అనుభవించే మనసుంటే చాలని చెబుతుంటారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర పోస్ట్ చేసిన ఓ వీడియో ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతుంది.

ఇంతకీ విషయమేంటంటే.. క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకొని కొందరు చిన్నారులు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. గ్రాండ్ అంటే భారీ ఖర్చు చేశారని అనుకుంటనే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఆ చిన్నారులు రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా అత్యంత సంతోషంగా వేడుకలను నిర్వహించుకున్నారు. వాటర్‌ బాటిళ్లనే బ్యాండ్‌, కర్రెలను మైక్‌గా మార్చి ప్రపంచాన్ని మరిచి సంతోషంగా గడిపారు. దీనిని వీడియోగా తీసి నెట్టింట పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో కాస్త ఆనంద్‌ మహీంద్ర కంటపడడంతో వెంటన్‌ వీడియోను ట్వీట్‌ చేశారు. వీడియోతో పాటు.. ‘లక్ష మాటల కంటే ఈ ఒక్క వీడియో చాలు. సంతోషమనే ఫ్యాక్టరీకి డబ్బు అవసరం లేదు. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోను చూస్తుంటే ఆ సెలబ్రేషన్స్‌ ఆఫ్రికాలో జరిగినట్లు కనిపిస్తోంది. ఈ చిన్నారుల సంతోషం చూస్తే మీరు కూడా సంతోషానికి డబ్బు అవసరం లేదని కచ్చితంగా ఒప్పుకుంటారు.

Also Read: CJI NV Ramana: స్వగ్రామం పొన్నవరంలో CJI ఎన్వీరమణకు ఘనసత్కారం.. విజయవాడలో సీజేఐతో సీఎం జగన్ భేటీ

Debit Card: మీరు డెబిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

RRR Movie: జక్కన్న మళ్లీ జలక్‌ ఇవ్వనున్నాడా..? ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుకోని అడ్డంకి.. వాయిదా అనివార్యమా..