మద్యం మత్తులో పైలట్‌ .. విమానం రద్దు..

|

May 03, 2024 | 7:36 PM

అమెరికాలోని డాలస్‌ నుంచి జపాన్‌ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్‌లోని హోటల్‌లో బస చేసిన విమాన పైలట్‌ ఫ్లైట్‌ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్‌ సిబ్బందితో, అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా తెలిసింది. పైలట్‌ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్‌ అందుబాటులో లేని కారణంగా విమానాన్నిజపాన్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది

అమెరికాలోని డాలస్‌ నుంచి జపాన్‌ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్‌లోని హోటల్‌లో బస చేసిన విమాన పైలట్‌ ఫ్లైట్‌ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్‌ సిబ్బందితో, అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా తెలిసింది. పైలట్‌ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్‌ అందుబాటులో లేని కారణంగా విమానాన్నిజపాన్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది. 157 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసింది. విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్యం కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్ లైన్స్‌.. ప్రయాణికులకు తెలిపిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ఫ్లైట్‌ రద్దు చేయడం వల్ల అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసింది విమానయాన సంస్థ. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనీ తమ సేవలపై నమ్మకాన్ని ఉంచండి అని ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ

విడాకులు తీసుకున్న కూతురికి మేళ‌తాళాల‌తో స్వాగ‌తం

డైమండ్‌ రింగ్‌ కావాలా ?? అయితే ఓటు వేయండి !!

షారూఖ్ చేసిన చిన్న మిస్టేక్‌తో.. 2 కోట్ల లాస్ !!

‘గుడ్డిగా నమ్ముతున్నాడు..’ స్టార్ హీరో తండ్రి ఆవేదన