AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home tour - Robo Shankar: హోం టూర్ వీడియో చేసి చిక్కుల్లో పడ్డ నటుడు..

Home tour – Robo Shankar: హోం టూర్ వీడియో చేసి చిక్కుల్లో పడ్డ నటుడు..

Anil kumar poka
|

Updated on: Mar 01, 2023 | 8:14 PM

Share

ఈ మధ్య హోమ్ టూర్స్ ఎక్కవైపోయాయి. యూట్యూబర్స్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టుల వరకు హోమ్ టూర్స్ అంటూ తమ ఇళ్లను చూపిస్తూ.. వీడియోలు చేస్తున్నారు. ఇలానే ఓ హోమ్ టూర్

ఈ మధ్య హోమ్ టూర్స్ ఎక్కవైపోయాయి. యూట్యూబర్స్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టుల వరకు హోమ్ టూర్స్ అంటూ తమ ఇళ్లను చూపిస్తూ.. వీడియోలు చేస్తున్నారు. ఇలానే ఓ హోమ్ టూర్ వీడియో చేసిన తమిళ నటుడు రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. అతడికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రెండున్నర లక్షల ఫైన్ విధించింది.చెన్నై సాలిగ్రామంలో ఉంటున్న నటుడు రోబో శంకర్‌ కొద్ది రోజుల క్రితం తన హోమ్ టూర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోలో అలెగ్జాండ్రిన్‌ పారాకీట్‌ అనే జాతి చిలుకలు.. అతడి ఇంట్లో పంజరంలో ఉన్నట్లు తమిళనాడు వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 16న అతడి ఇంటిపై దాడి చేసి.. 2 చిలుకలను సంరక్షించి.. తీసుకెళ్లి గిండిలోని పార్కులో అప్పగించారు. అయితే ఆ సమయంలో రోబో శంకర్‌, ఆయన అర్థాంగి శ్రీలంకలో ఉండటంతో దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు జారీ చేశారు. తాజాగా వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఎదుట రోబో శంకర్‌ హాజరై వివరణ ఇచ్చారు. తన భార్య ఫ్రెండ్ 3 సంవత్సరాల క్రితం ఈ చిలుకలను ఇచ్చినట్లు వివరించారు. వీటిని పెంచేందుకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తీసుకోవాలన్న విషయం తెలియదని, ఇందుకు క్షమాపణ కోరుతున్నట్లు చెప్పాడు. దీంతో అధికారులు వారిపై కేసు ఫైల్ చేయకుండా రెండున్నర లక్షల ఫైన్ వేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..