Samantha: నాకు ఇష్టమైన వ్యక్తి ..! రివీల్ చేసిన సమంత ఎమోషనల్ వీడియో.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. మళ్లీ మునుపటిలా సినిమా షూటింగుల్లో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో తాను చేయబోయే వెబ్‌సిరీస్‌లోని పాత్ర కోసం తెగ కష్టపడుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. మళ్లీ మునుపటిలా సినిమా షూటింగుల్లో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో తాను చేయబోయే వెబ్‌సిరీస్‌లోని పాత్ర కోసం తెగ కష్టపడుతున్నారు. పాత్రకు తనదైనశైలిలో జీవం పోయాలనే తపన ఆమెలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లోని ఓ పాత్రకోసం సామ్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘నాకు ఇష్టమైన వ్యక్తి’ అని పేర్కొంటూ తన ట్రైనర్‌ను పరిచయం చేశారు. ఆయనెవరో కాదు హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్‌బెన్. ఈ మేరకు పోస్ట్ చేసిన వీడియోలో యానిక్‌తో సమంత బాక్సిగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ‘నైనిటాల్‌లో.. 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో’ అంటూ సమంత సమాచారం ఇచ్చారు. అంతేకాదు, నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని కూడా సందర్శించినట్టు మరో పోస్ట్ ద్వారా తెలిపారు.సమంత ఇటీవల నటించిన ‘యశోద’ చిత్రానికి యానిక్ పనిచేశారు. ‘సిటాడెల్’ కోసం ఇప్పుడు మరోసారి కలిశారు. వరుణ్ ధావన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సిరీస్ ఇది. మరోవైపు, మార్చినుంచి ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లోనూ సమంత పాల్గొంటారని సమాచారం. ఇక సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందించిన ‘శాకుంతలం’ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..