కలిసి ఉంటూనే.. కాలయముడయ్యాడు.! స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బార్బర్ షాప్‌లో ఉపయోగించే కత్తితో స్నేహితుడిపై దాడిచేసి చంపేశాడు ఓ వ్యక్తి. పోలీసుల కథనం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసే వెంకటరమణ, బార్బర్ షాప్‌లో పనిచేసే గణేశ్ కలిసి ఒకే రూములో ఉంటున్నారు. గణేశ్‌కు మద్యం తాగే అలవాటు ఉండడంతో నిత్యం రాత్రి మద్యం తాగి రూముకు వచ్చేవాడు.
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బార్బర్ షాప్‌లో ఉపయోగించే కత్తితో స్నేహితుడిపై దాడిచేసి చంపేశాడు ఓ వ్యక్తి. పోలీసుల కథనం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసే వెంకటరమణ, బార్బర్ షాప్‌లో పనిచేసే గణేశ్ కలిసి ఒకే రూములో ఉంటున్నారు. గణేశ్‌కు మద్యం తాగే అలవాటు ఉండడంతో నిత్యం రాత్రి మద్యం తాగి రూముకు వచ్చేవాడు. దీంతో తనకు నిద్రాభంగమవుతోందని, తాగి రూముకు రావొద్దని గణేశ్‌ను వెంకటరమణ పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు.
గత అర్ధరాత్రి మరోమారు తాగి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదరడంతో కోపంతో ఊగిపోయిన గణేశ్ సెలూన్‌లో ఉపయోగించే కత్తితో వెంకటరమణను విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణది కర్నూలు జిల్లా ఆలమూరని పోలీసులు తెలిపారు. అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

