Viral: గాల్లోకి నోట్లు వెదజల్లుతూ.. బాణసంచా కాలుస్తూ రచ్చ.. వీడియో వైరల్‌ అవ్వడంతో ఎదురు దెబ్బ.

Viral: గాల్లోకి నోట్లు వెదజల్లుతూ.. బాణసంచా కాలుస్తూ రచ్చ.. వీడియో వైరల్‌ అవ్వడంతో ఎదురు దెబ్బ.

Anil kumar poka

|

Updated on: Nov 01, 2023 | 8:10 PM

జాతర, వివాహాలు తదితర కార్యక్రమాల్లో డ్యాన్సులు వేసే సమయంలో కరెన్సీ నోట్లను విసరడం తరచూ చూస్తూనే ఉంటాం. ఊరు, పేరు తెలీని కొందరు ఉన్నట్టుండి జనం మధ్యలోకి వచ్చి డబ్బులు వెదజల్లుతూ హల్‌చల్ చేస్తుంటారు. కొందరైతే వాహనాల్లో వెళ్తూ కూడా నోట్ల కట్టలను గాల్లోకి విసిరేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు.

జాతర, వివాహాలు తదితర కార్యక్రమాల్లో డ్యాన్సులు వేసే సమయంలో కరెన్సీ నోట్లను విసరడం తరచూ చూస్తూనే ఉంటాం. ఊరు, పేరు తెలీని కొందరు ఉన్నట్టుండి జనం మధ్యలోకి వచ్చి డబ్బులు వెదజల్లుతూ హల్‌చల్ చేస్తుంటారు. కొందరైతే వాహనాల్లో వెళ్తూ కూడా నోట్ల కట్టలను గాల్లోకి విసిరేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌లో కొందరు రెచ్చిపోయారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. రాజ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోపల ముగ్గురు వ్యక్తులు కారు పైకప్పు పై నిలబడి బాణసంచా కాలుస్తూ.. డబ్బులు వెదజల్లారు. అపార్ట్‌మెంట్‌ యజమానుల సంఘం వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా సదరు యువకులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నంద్‌గ్రామ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రవి కుమార్‌ సింగ్‌ చెప్పినదానిని బట్టి చూస్తే.. యువకులు అభ్యంతరకరమైన పదాలు సైతం ఉపయోగించారని, ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారన్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..