ఇటీవల అనకాపల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకొచ్చాడు చందు. ఆ తర్వాత షరామాములుగా తల్లి సాయంతో ఆ బాలికతో వ్యభిచారం చేయించాడు. బాలికకు ఇన్ఫెక్షన్ రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపి డాక్టర్ ద్వారా అనేక రకాలైన మందులు వాడించారు. శారీరక బాధలతోపాటు తల్లి, కొడుకులు పెట్టే బాధలు భరించలేక డిసెంబర్ 28న బాలిక పెద్దాపురంలో చీమల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయగా బాలిక కాళ్లు చేతులు వంకర్లు పోయి కదలలేని స్థితికి చేరుకుంది. కాకినాడ ఆసుపత్రికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు బాలికను విశాఖలోని విమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు పై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది
పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు!