Woman comforted the Devil by song: దెయ్యాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక మహిళ బాధలో ఉన్న దెయ్యాన్ని ఓదారుస్తూ పాట పాడిందట. అమెరికాలోని అరిజోనా వల్చర్‌సిటీలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వల్చర్‌సిటీని దెయ్యాల పట్ణణంగా పిలుస్తారు. ముగ్గురు వ్యక్తులు డాక్యుమెంటరీ సిరీస్ కోసం అక్కడికి వెళ్లారు. అందులో భాగంగా మహిళ పాట పాడింది. అయితే, అది దెయ్యాన్ని ఓదార్చేందుకు పాడినట్లు వాళ్లు చెబుతున్నారు.
సదరు మహిళ ఒక గదిలో ఉన్న దెయ్యంతో మాట్లాడిందట. ఈ దెయ్యంతో మాట్లాడేటప్పుడు ఆ గదిలో ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్‌ని ఉంచారు. దెయ్యాలు చెప్పే మాటలు, అవి ఇచ్చే సిగ్నల్స్… ఈ యంత్రం ద్వారా తెలుస్తాయని దెయ్యాల పరిశోధకులు చెబుతారు. ఈ యంత్రాన్ని గదిలో పెట్టినప్పుడు ముందుగా గీయ్‌య్‌య్‌య్ మని శబ్దం వచ్చిందట అప్పడు మహిళ నువ్వు ఎవరు అని అడిగినప్పుడు యంత్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. దీంతో తనతోపాటు ఫ్రెండ్స్ ఇద్దరినీ బయటకు పంపేసిందట. అప్పడు దెయ్యం మాట్లాడుతూ.. “నేను బాధలో ఉన్నాను, నాకు మగవాళ్లు అంటే నచ్చరు’ అంటూ తరంగాలతో చెప్పిందట. ఈ క్రమంలో దెయ్యంతో మాటలు కలిపిన మహిళ.. సరే నీ బాధ పోగొట్టడం కోసం నేను పాట పాడనా అని అడిగిందట దెయ్యాన్ని. దాంతో ఓకే అన్నట్టుగా ఆ యంత్రం నుంచి గీయ్‌య్‌య్‌మంటూ శబ్ధం వచ్చిందట. మహిళ పాట పాడిన తర్వాత మళ్లీ శబ్ధం వచ్చిందంట. అంటే ఆ పాట దెయ్యానికి నచ్చిందట.. దాంతో వాళ్లు దెయ్యానికి ఓదార్పునిచ్చామని హ్యాపీ ఫీలయ్యారట. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదిలావుంటే వల్చర్ సిటీలో వ్యభిచార వృత్తి చేసే మహిళలు ఉండేవారనీ… వారిలో చాలా మంది లైంగిక వేధింపులు ఎదుర్కొని చనిపోయారని, అలాంటి వాళ్లు చనిపోయాక దెయ్యాలుగా మారి బాధపడుతూ ఉన్నట్లు ఆ మహిళ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిందట. ఈ వీడియోలో దెయ్యంతో మాట్లాడానని చెబుతున్న మహిళ కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదొక బుద్ధిలేని పని అని ఓ నెటిజన్ అంటే, కొకైన్ వాడితే అలాగే అవుతుందని మరొకరు కామెంట్ చేశారు. విశ్వం నుంచి ఆ యంత్రంలోకి ఏవో తరంగాలు వచ్చి ఉంటాయని మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.
Read Also….
Shocking: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం