Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

snake wrapped neck: వ్యక్తి మెడకు చుట్టుకున్న పాము.. చాకచక్యంగా ఎం చేసాడు అంటే...

snake wrapped neck: వ్యక్తి మెడకు చుట్టుకున్న పాము.. చాకచక్యంగా ఎం చేసాడు అంటే…

Anil kumar poka

|

Updated on: Aug 01, 2022 | 10:02 AM

అమెరికాలో విచిత్ర సంఘటన జరిగింది. పెన్సిల్వేనియాకు చెందిన ఓ వ్యక్తి మెడకు ఓ పొడవైన పాము చుట్టేసుకుంది. దాంతో అతను ఊపిరాడక చావు అంచులవరకూ వెళ్లాడు. పోలీసుల రంగ ప్రవేశంతో


అమెరికాలో విచిత్ర సంఘటన జరిగింది. పెన్సిల్వేనియాకు చెందిన ఓ వ్యక్తి మెడకు ఓ పొడవైన పాము చుట్టేసుకుంది. దాంతో అతను ఊపిరాడక చావు అంచులవరకూ వెళ్లాడు. పోలీసుల రంగ ప్రవేశంతో ప్రాణాలతో బయటపడ్డాడు. హర్రర్‌ మూవీని తలపించే ఈ సీన్‌ ఇప్పడు నెట్టింట వైరల్‌గా మారింది.

పెన్సిల్వేనియాకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి పాములను సేకరిస్తుంటాడు. అతడి ఇంట్లో చాలా రకాల పాములు ఎన్‌క్లోజర్స్‌లో ఉన్నాయి. జూలై 20వ తేదీన ఓ 15 అడుగుల పొడవైన, బలమైన పాము అతడి మెడకు చుట్టుకుంది. దాంతో అతనికి ఊపిరి అందక గుండెపోటు కూడా వచ్చింది. దాంతో అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతడి మెడ చుట్టూ పెద్ద పాము చుట్టుకుని ఉండటం చూసి ఎలాగైనా అతడ్నికాపాడాలనుకున్నారు. ఎంతో జాగ్రత్తగా ఆ పాము తలపై గన్‌తో కాల్పులు జరిపారు. గాయపడిన పాము ఆ వ్యక్తి మెడను విడిచిపెట్టింది. దీంతో అతడ్ని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తన 19 ఏళ్ల సర్వీసులో ఇలాంటి భయానక సంఘటన ఎప్పుడూ చూడలేదని ఆ వ్యక్తిని కాపాడిన ఒక పోలీస్‌ అధికారి తెలిపాడు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటం ముఖ్యమని భావించి పాము తలపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు వివరించాడు. అయితే ఆ పాము వెంటనే చనిపోలేదని తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహరించిన పోలీసు సిబ్బందిని అధికారులు ప్రశంసించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 01, 2022 09:59 AM