Snake Viral video: అయ్యో పాపం పాము.. ఎంతకష్టం వచ్చిందో.. ఫ్యాన్‌ రెక్కల్లో ఇరుక్కుపోయింది..

Snake Viral video: అయ్యో పాపం పాము.. ఎంతకష్టం వచ్చిందో.. ఫ్యాన్‌ రెక్కల్లో ఇరుక్కుపోయింది..

Anil kumar poka

|

Updated on: Jun 22, 2023 | 5:43 AM

ఎండ వేడిని తట్టుకోలేక.. సరీసృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇలా రావడం వల్ల.. అటు మనుషులకు.. ఇటు సరీసృపాలకు ఊహించని ప్రమాదాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఎండ వేడిని తట్టుకోలేక.. సరీసృపాలు తమ ఆవాసాలను విడిచిపెట్టి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇలా రావడం వల్ల.. అటు మనుషులకు.. ఇటు సరీసృపాలకు ఊహించని ప్రమాదాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ పాము ఎండవేడిని తట్టుకోలేక ఇంట్లోకి ప్రవేశించింది. ఎలా చేరుకుందో.. ఏమో తెలియదు గానీ.. సరాసరి సీలింగ్ ఫ్యాన్‌ పైకి చేరుకొని దాని రాడ్‌‌ను చుట్టుకుని ఉంది. ఇంతలో ఇంట్లో ఎవరో ఫ్యాన్‌ ఆన్‌ చేశారు. దాంతో ఆ ఫ్యాన్ తిరగడం మొదలైంది. ఊహించని పరిణామానికి పాము షాక్‌ తింది. ఫ్యాన్‌తోపాటు గిరగరా తిరుగుతూ నానా అవస్థలు పడింది. అక్కడ నుంచి బయటపడటానికి విశ్వప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నించిన ప్రతిసారీ తల ఫ్యాన్ రెక్కకు తగులుతుంది. కానీ ఆ పాము ఫైనల్ అటెంప్ట్ చేద్దామనుకున్నట్లుంది.. చివరిగా ధైర్యం చేసి కిందకు దూకి ఇదంతా వీడియో తీస్తున్న వ్యక్తిపై పడింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా.. దీన్ని చూసి నెటిజన్లు.. వీడియో తీసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపం.! ఆ పామును వీడియో తీయకుండా.. కాపాడొచ్చు కదా అని తిట్టిపోస్తున్నారు. పాముకి చిన్నపాటి గాయాలైనట్టు తెలుస్తోంది. అనంతరం స్నేక్‌ క్యాచర్‌కి సమాచారమిచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!