Crime Video: ముద్దు పెట్టకుంటే.. భవనం పైనుంచి తోసేస్తా.. టీచర్ నిర్వాకం..

Crime Video: ముద్దు పెట్టకుంటే.. భవనం పైనుంచి తోసేస్తా.. టీచర్ నిర్వాకం..

Anil kumar poka

|

Updated on: Jun 22, 2023 | 6:22 AM

పిల్లలకు మంచి నడవడిక నేర్పి.. తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్ధులపాలిట కీచకుల్లా మారుతున్నారు. కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్ధులను కామంతో చూస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.

పీఈటీ టీచర్‌ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు. దాంతో పీఈటీతోపాటు ప్రధానోపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ ఉన్నత పాఠశాల పీఈటీ సంగ్రాం.. మార్చిలో ముగ్గురు విద్యార్థినులను వేర్వేరుగా పాఠశాల భవనంపైకి తీసుకువెళ్లాడు. ముద్దు పెట్టాలని, లేకపోతే కిందకు తోసేస్తానంటూ భయపెట్టాడు. ఇటీవల వేసవి సెలవులు అనంతరం పాఠశాల ప్రారంభమైనా.. ఆ బాలికలు బడికి వెళ్లడం లేదు. పీఈటీ చీటర్‌ ఉంటే భయంగా ఉందని, తాము స్కూలుకి వెళ్లమని ఆ బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన వారు గ్రామస్థులతో కలిసి శుక్రవారం స్కూలుకి వెళ్లారు. పీఈటీకి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ప్రధానోపాధ్యాయుడు గురునాథ్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయనపైనా దాడిచేశారు. సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో బయటి నుంచి వచ్చిన హోంగార్డు ప్రతాప్‌ సింగ్‌ గ్రామస్థులను దూషించడంతో వారు అతడిపైనా చేయిచేసుకున్నారు. సంఘటన స్థలానికి డీఈఓ వెంకటేశ్వర్లు, కంగ్టి సీఐ రాజశేఖర్‌ వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. పీఈటీ, హెచ్‌ఎంలను సస్పెండ్‌ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీచేశారు. పీఈటీపై పోక్సో కేసు నమోదు చేస్తామని, హోంగార్డుపైనా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!