Bear - Tiger cub: పులి కూనతో చిన్నారి ఎలుగు ఆటలు.. ‘సింబా ఎక్కడా’ అంటున్న నెటిజన్లు..

Bear – Tiger cub: పులి కూనతో చిన్నారి ఎలుగు ఆటలు.. ‘సింబా ఎక్కడా’ అంటున్న నెటిజన్లు..

Anil kumar poka

|

Updated on: Jun 21, 2023 | 9:33 PM

సాధారణంగా రెండు జాతులకు చెందిన జంతువులు కలిసి ఉండటం చాలా అరుదు. అవి కూడా క్రూర మృగాలమధ్య స్నేహం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ ఇక్కడ రెండు భిన్నజాతులకు చెందిన జంతువులు స్నేహమంటే ఏంటో చాటి చెబుతున్నాయి. అవును..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట ఓ చిన్న పులికూన, ఎలుగుబంటి పిల్ల కలిసి ఆడుకుంటున్నాయి. అవి చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉన్నాయి. వాటికి చెందిన తల్లులు ఎలా ఉంటాయో తెలియదు కానీ జాతివైరం తెలియని ఆ చిన్నారి కూనలు ఎంతో స్నేహంగా మెలగుతున్నాయి. ఇందులో చిన్నారి ఎలుగు పులికూనను కౌగిలించుకోవాలని ప్రయత్నిస్తుంది అయితే పులికూన దానిని వెనక్కి నెట్టేస్తుంటుంది. ఈ సరదా సన్నివేశం నెటిజన్లను కట్టిపడేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించారు. 90 వేలమందికి పైగా లైక్‌ చేశారు. స్నేహం అనేది క్రూర మృగాల్లోనూ ఉంటుందని, దాన్ని గ్రహించడం చాలా కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకా అవి సాధారణ ఎలుగు, పులి పిల్లలు కాదని.. షేర్ ఖాన్, భల్లూ అని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!